భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఎందుకంటే పెళ్లి అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన యువతి యువకులు ఇద్దరు కూడా ఎన్ని మనస్పర్ధలు వచ్చిన సర్దుకుపోయి జీవితాన్ని గడపాలి. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. అయితే భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వారి బంధం మరింత బలపడుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అటు చిన్న చిన్న గొడవలే చివరికి బంధం తెంచుకునే వరకు కూడా దారితీస్తున్నాయి.


 ఏకంగా చిన్న గొడవలతోనే ఎంతోమంది ఒకరిని ఒకరు హత్య చేసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉండగా.. ఇంకొంతమంది విడాకులు తీసుకుని బంధాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు చూసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖ పట్టడం లేదు అని చెప్పాలి. ఇక్కడ ఓ మహిళ ఇలాంటిదే చేసింది. భర్త కోపంలో చేయి చేసుకున్నాడు అన్న కారణంతో చివరికి మనస్తాపంతో తన జీవితాన్నే ముగించాలని అనుకుంది.


 ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. 32 ఏళ్ల లక్ష్మీబాయి రమేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఖైరతాబాద్ లోని ఇందిరానగర్ లో ఈ దంపతులు ఉంటున్నారూ. అయితే రమేష్ ఎర్రగడ్డలోని మానసిక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిపోయిన రమేష్ నిత్యం తాగి వచ్చి భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఇక ఇటీవల మరోసారి ఇలా ఫుల్లుగా మద్యం తాగొచ్చి భార్యను కొట్టాడు. దీంతో వేధింపులు తాలలేకపోయిన సదరు మహిళ మనస్థాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పట్టించుకుంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: