
ఆయన లెక్క ప్రకారం భారత దేశంలో "భా" అంటే కాంతి లేదా ప్రకాశం అనీ, "రత" అంటే అంకితమైంది లేదా ఆసక్తి కలది అనే అర్థం వస్తుందట. భగవంతుడు కాంతి రూపుడు. భారతం అంటే భగవంతుడికి అంకితమైనదని లేదా భగవంతుడిపై ఆసక్తి కలది అనే అర్థం వస్తుందట. భారతదేశం అనే పదానికి అచ్చమైన అర్థం ఇదేనట. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాలన్నిటిలో కూడా జంబూ ద్వీపే, వైవస్వత మన్వంతరే, భరత ఖండే అనే సంకల్పం చెప్తారు.
గతంలో ఇది పాకిస్తాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ ఆలయాల్లో కూడా చెప్పేవారట. భారతదేశం అఖండమైనది చెప్పడమే దీని అంతరార్థం. కొంతమంది భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సమాఖ్య అని అంటూ ఉంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వేళ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని రాష్ట్రాలు విడివిడిగా లేవు. మరి ఏ రాష్ట్రాల సమాఖ్యగా భారతదేశం స్వతంత్రమైన రాజ్యాంగ ఏర్పడింది .
2వేల ఏళ్ల క్రితం తమిళ సాహిత్యం పురాణసురు అనే దాంట్లో భారతదేశం ఉత్తరాన హిమాచలం నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఉందని చెప్పారు. మెగాస్తనీస్ ఉత్తరాది హిమాచలాల నుండి దక్షిణాదిన కన్యాకుమారి వరకు ఇండికా అని గుర్తించాడు. మెగాస్తనీస్ కు ముందు హెడాక్టర్స్ ఈ ప్రాంతాన్ని ఒక దేశంగా చెప్పాడు. ఏడవ శతాబ్దంలో హ్యూయన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు ఈ ప్రదేశాన్ని ఇంగో అంటే ఇండి-ఆ గా చెప్పాడట.