కానీ ఆ శరణార్థులు కృతజ్ఞతతో ఉండడం అలా ఉంచి తమకు ఆశ్రయం ఇచ్చిన దేశంలోనే అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళు ఫ్రాన్స్ కి వచ్చి మరీ అల్లర్లు సృష్టించడానికి వెనుకనున్న కారణం వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం వాళ్ళు అయితే కాదన్నట్లు సమాచారం. ఈ అల్లర్లకి వారి దేశాలైన అల్జీరియా, అల్మేనియా, ఆఫ్ఘనిస్తాన్ కూడా కారణం కాదు. అందుతున్న సమాచారం ప్రకారం వాళ్లని ఎవరూ ఇలా అల్లర్లు సృష్టించమని పురిగొల్పలేదని తెలుస్తుంది.
ఫ్రాన్స్ లో ఉన్న ఆ శరణార్థులు అక్కడ ఉన్న పోలీసులపై దాడులు చేస్తున్నారు. సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారు. తాము ఏ మత దేశాల కబంధ హస్తాల చేతిలో నుండి బయటకు వచ్చారో, అదే మతాన్ని ఇక్కడున్న ప్రజలపై రుద్ది వాళ్లను కూడా తమ మతంలోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ సంఘటనల తర్వాత అయినా యూరప్ ఇలాంటి వాళ్ళ విషయంలో బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
జరుగుతున్న ఈ అల్లర్లను చూసిన తర్వాత అయినా యూరప్ కళ్ళు తెరవాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు వాళ్లు. ఈ సందర్భంగా యూరప్ కు సూచనలు ఇస్తున్నారు. ప్రక్క దేశాలను కూడా మత రాజ్యాలుగా మార్చేయాలని ప్రయత్నం చేసే ఈ ఉన్మాదుల విషయంలో యూరప్ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి