సీఎం వైఎస్ జగన్ పై ప్రతిపక్షాలు రోజు ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతూ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి చంద్రబాబు, యువగళంలో లోకేశ్ జగన్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.


అయితే ప్రతిపక్షాలుగా ఉన్న వీరు పదే పదే రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా.. జగన్ స్పందించడం లేదు. ఏదో ఒక సారి ప్రభుత్వ మీటింగ్ పెడితే అందులో మీటింగ్ అంతా అయిపోయే సమయంలో టీడీపీ, జనసేన పార్టీలపై ఆయా నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది.


దీంతో పవన్ కూడా జగన్ పై ఆయన కుటుంబంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారిపోతున్నాయి. జగన్ మాత్రం ప్రతిపక్షాలు విమర్శలు చేసిన వెంటనే స్పందించకుండా దాదాపు 10 లేదా 15 రోజుల తర్వాత స్పందిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆయన ఇస్తున్న కౌంటర్లు బాగానే ఉంటున్నా.. వ్యక్తిగతంగా మారడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది.


అయితే వెంటనే విమర్శలకు సమాధానం చెబితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పవన్, చంద్రబాబు లను విమర్శించడం చేస్తున్నారు. పవన్, చంద్రబాబు లాంటి నాయకులు జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించినపుడు వాటికి ఆయనే సమాధానం చెబితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గురించి కూడా ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పటి వరకు బాలకృష్ణపై జగన్ విమర్శలు చేయలేదు. ఒక్క సారిగా బాలయ్యపై విమర్శలు చేయడం వెనక ఏదైనా బలమైన కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: