ఇండియాకు గతంలో రష్యా తో మాత్రమే స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అయితే అంతకుముందు పాకిస్తాన్‌తో యూరప్ కంట్రీలు ఎక్కువగా అన్యోన్యంగా ఉండేవి. అమెరికా కూడా భారత్ కంటే పాకిస్తాన్ కే ఎక్కువగా సపోర్ట్ చేసేది. ఆర్థికంగా మెరుగుపడాలని ఎన్నో నిధులు ఇచ్చేది. కానీ పాకిస్తాన్‌లో ఉన్న ప్రభుత్వమే  అక్కడ ఉన్న యువత, ప్రజలను సరైన మార్గంలో నడిపించక తప్పుదారి పట్టించి ఉగ్రవాదం వైపు నడిపించి భారత్ టార్గెట్గా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.


కానీ వాటన్నిటికీ ఎదుర్కొని నిలబడి భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా నిలిచింది. కేవలం తన స్వశక్తి తో వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో ఇండియా ముందుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారి తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటుంది.ముఖ్యంగా గతంలో చైనాతో ఎక్కువగా ఆర్థిక సంబంధాలు కూడా పెట్టుకుంది.


అమెరికాతో యూరప్ దేశాలతో  మంచి సంబంధాలే ఉండేవి. దీంతో పాటు గల్ఫ్ దేశాలతో కూడా పాకిస్తాన్ కు సత్సబంధాలు ఉండేవి. కానీ ఇండియాలో నరేంద్ర మోడీ  ప్రభుత్వం  వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోని వివిధ దేశాల నేతలతో సమావేశం అవుతూ భారత్లో పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. దీంతో ఆర్థిక రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి.


దీనివల్ల భారత్ ఆర్థికంగా ముందడుగు వేస్తుంది. ఒక సరైన ప్రణాళిక నిర్దిష్టమైన లక్ష్యంతో ఇండియా ముందుకు సాగుతుంటే పాకిస్తాన్ చూస్తూ ఉండలేక పోతుంది. దీంతో పాకిస్తాన్ మంత్రి హీన రబ్బాని మాట్లాడుతూ ఇండియాకు సరికొత్త స్నేహాలు వస్తున్నాయి. యూరప్ దేశాలు ఇండియాని ఎక్కువగా ఇష్టపడుతున్నాయని కామెంట్లు చేసింది. గతంలో ఏ దేశాన్ని ఇష్టపడ్డారో ఇప్పుడు దాన్ని కాదని ఇండియాని ఇష్టపడడం చూసి పాకిస్తాన్ ప్రభుత్వం తట్టుకోలేక విమర్శలు చేస్తోందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: