కొంత మంది జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రష్యా వద్ద నుండి ఈ ఆయిల్, డీజిల్, గ్యాస్ అనేవి కొంటూ ఉన్నారు. ఎందుకంటే రష్యా చౌకగా అందిస్తుంది కాబట్టి. మరి యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన దేశాలైతే ఈ ఆంక్షలుకు లోబడి రష్యా వద్ద నుండి వీటిని కొనడం లేదని అనుకున్నారు మొన్నటి వరకు. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. దానికి నిదర్శనమే యూరోపియన్ యూనియన్ తమ సభ్యత్వ దేశాలకు ఇచ్చిన వార్నింగ్.
మనం అందరూ మాట్లాడుకుని పెట్టుకున్న ఆంక్షలు మనమే పాటించడం లేదు అని ఈయు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది ఈయూ దేశాలు అన్ని కలిపి కొన్న వాటిలో సగానికి పైగా రష్యా నుండే కొన్నారట. పెట్రోల్ గాని, గ్యాస్ గాని, డీజిల్ గాని 52శాతం వరకు రష్యా వద్ద నుండే ఈయూ దేశాలు కొన్నాయి అని తెలుస్తుంది. అరబ్ దేశాలు కూడా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ అనేవి అమ్ముతూ ఉంటాయి.
కానీ వాటి దగ్గర ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందట. అయినా అవి అన్ని దేశాలకు సప్లై చేసే అంత కెపాసిటీని కలిగి ఉండవు. అందుకే రష్యాపై ఆధారపడి అన్ని దేశాలు బ్రతుకుతున్నాయి. అయితే కొన్ని మధ్యే మార్గంగా అంటే, భారతదేశం రష్యా వద్ద కొంటే భారతదేశం నుండి అమెరికా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనేవి కొంటుందట. ఇప్పుడైతే ఈయు తన సభ్యత్వ దేశాలను రష్యా వద్ద నుండి కొనవద్దని హెచ్చరిక జారీ చేసిందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి