
తొలుత జీవో లు ఒప్పందం లో గ్రాాంట్ ఇన్ లో ఆర్థిక సహకారం అనే చోట గ్రాంట్ ఇన్ కైండ్ అని వస్తు సహాకారం చేరింది. చివరకు గ్రాంట్ ఇన్ కైండ్ సైతం అదృశ్యమైంది. మాయాజాలంలో టెండర్ల ప్రక్రియ లేకుండానే పోయింది. దీంతో డిజైన్ టెక్ కు అప్పనంగా అప్పగించేశారు. దాదాపు రూ. 371 కోట్లు చెల్లించేశారు. అందులో రూ. 240 కోట్లు షెల్ కంపెనీల ద్వారా బాబు కు చేరవేశారు. ఎపీఎస్ఎస్ డీపీ ముసుగులో నిధులను కొల్లగొట్టాలని ప్లాన్ వేశారు.
ఆరు క్లస్టర్లుగా అంచనా నివేదికను తయారు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వివిధ అంశాలను ప్రాతిపదిక చేసుకుని ఏడు నివేదికలు తయారు చేశారు. వాటిల్లో ప్రాజెక్టు కనిష్ట వ్యయం రూ. 214 కోట్లు కాగా, గరిష్ట వ్యయం 282 కోట్లుగా ఉంది. బినామీ సంస్థ డిజైన్ టెక్ లాభం మొత్తం 34.88 శాతంగా కలుపుకుని ఒక్కో క్లస్టర్లు 55 కోట్లుగా ఆరు క్లస్టర్లకు 330 కోట్లు అవుతుందని చెప్పారు. అందులో సిమోన్ డిజైన్ టెక్ భరిస్తుందని తెలిపారు. అయితే దీని గురించి సిమోన్ కంపెనీకి తెలియదు.
ఆ కంపెనీ 90 శాతం నిధులు సమకూర్చదని చంద్రబాబుకు తెలిసిన కూడా కావాలనే చేశారు. లాభ ప్రస్తావన ఉన్నా కంపెనీకి గ్రాంట్ ఇన్ ఎలా వస్తుందని చంద్రబాబుకు ఎలా తెలియదో ఇప్పటికీ అర్థం కాదు. ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేస్తే 10 శాతం కమిషన్ వస్తుందని ఆశించారని తెలుస్తోంది.