విజయసాయి రెడ్డి పోస్టుల రూపంలో రోజూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. అది కూడా చాలా తెలివిగా కేంద్రంతో సంబంధాలు దెబ్బతినకుండా.. కేవలం వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆమెను తెలుగుదేశం వ్యక్తిగా చిత్రీకరంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి మరో పోస్టు పెట్టారు. చేశారు. కులం, కుటుంబం చుట్టూనే పురంధేశ్వరి తిరుగుతుంది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్థ ప్రయోజనాల కోసమే.. అంతిమ లక్ష్యం కుల ఉద్ధారణే అంటూ విమర్శించారు.
స్వార్థం తప్ప..సిద్ధాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం అనేవి పురంధేశ్వరికి లేవని..ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్థం కపటం పురంధేశ్వరి సహజ ఆభరణాలు అని.. టీడీపీతో పొత్తు లేకున్నా.. సొంత ప్రయోజనాల కోసం పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారని ఎద్దేవా చేశారు.
బంధుత్వం చాటున బావ, చంద్రబాబు సాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి కావాలనుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఆయనపై ఈగ వాలకుండా విసరకర్ర విసురుతున్నారిని విమర్శించారు. పురంధేశ్వరి పాద స్పర్శతో కాంగ్రెస్ పాతాళంలోకి పోయిందని.. రాజకీయ, నైతిక విలువలు లేకుండా కాంగ్రెస్ ను వదిలి.. బీజేపీలో చేరానని అన్నారు. వరుస పోస్టులతో పురంధేశ్వరిని వెంటాడుతున్నారు. అయితే వీటిని గమనిస్తే ఎక్కడా పార్టీని విమర్శిండచం లేదు. కేవలం వ్యక్తిగతంగా వెళ్తునట్లు కనిపిస్తోంది. మరోవైపు పురంధేశ్వరి కూడా వీటిని గట్టిగానే తిప్పికొడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి