రాజకీయ నాయకులు దగ్గర బౌన్సర్లన చూసి సినీ నటులు తమ వద్ద వారిని నియమించుకున్నారు. ఇది ఒక హోదా లా ఫీలవుతున్నారు. ప్రస్తుతం హీరో సహాయకులు, సినీ పరిశ్రమ కు చెందిన వారయితే చాలు బౌన్సర్లను మైయింటేన్ చేస్తున్నారు. ఎస్కార్ట్, పెద్ద సంఖ్యలో కార్లు వంటివి చూపించి సినిమా వాళ్లు ఒక హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఏదైనా అద్భుతం అనిపిస్తే మనవాళ్లు వెంటనే వారి సినిమాలో పెట్టేస్తుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రత కలిగిన నాయకుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఆయన అరబ్ దేశాల పర్యటనకు వెళ్లారు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. ఆయన తన వెంట ఎస్కార్ట్ గా యుద్ధ విమానాలను తీసుకువెళ్లారు. సాధారణంగా కార్లకు ఎస్కార్ట్ వంటివి మనం చూసుంటాం. కానీ సుఖోయ్ లాంటి యుద్ధ విమానాల నడుమ పుతిన్ ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే ప్రథమం. దీనిని మన సినిమా వాళ్లు కాపీ కొడతారేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి