అయితే సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ప్రమేయంతో దోచుకుపోతున్న కాశ్మీర్ లో ఒక వంతును మాత్రం భారత్ లో వదిలేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మన భారతదేశంలోని కాశ్మీర్ లోని 3వంతులు పాకిస్థాన్ వద్ద ఉంటే, ఒక వంతు మాత్రమే భారతదేశం చేతిలో ఉంది. అప్పటికీ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ మిగిలిన మూడు వంతులు భాగం కోసం ప్రయత్నిస్తుండగా నెహ్రూ ఒక వంతైనా మనకు మిగిలింది కదా అనేసరికి పటేల్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటారు.
అయితే ఆర్టికల్ 370 35ఏ రద్దును సమర్థిస్తూ కోర్టు తీర్పు ఇచ్చేసరికి పాకిస్తాన్ ఈ తీర్పుపై మండిపడుతుంది. ఇప్పుడు ఒక దొంగకు మరొక దొంగ జత అవడం జరిగింది. అది మరెవరో కాదు గతంలో చీని భారత్ భాయి భాయి అని ప్రధానమంత్రి నెహ్రూజీ చెప్పినటువంటి చైనా. చైనా గతంలో మన వద్ద ఉన్న సియాచిన్ ప్రాంతం లోని భూభాగాన్ని కబ్జా చేసింది.
అలాగే భారత్ సరిహద్దుల వద్ద ఉన్నటువంటి గాల్వన్ లోయలోని ప్రాంతాలను కూడా చైనా కబ్జా చేయడం జరిగింది. ఇలా భారత్ లోని పలు ప్రదేశాలను అటు చైనా ,ఇటు పాకిస్తాన్ రెండూ దోచుకోవడం జరిగింది. ఈ సందర్భంలో భారత్ పై విరోధం ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తోడుగా సంఘీభావాన్ని తెలుపుకుంటున్నారట ఇప్పుడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి