ఉక్రెయిన్  రష్యా సైనిక చర్య మొదలై 22 నెలలు కావొస్తోంది. సైన్యం విషయంలో ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాల  మధ్య రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు చెందిన దాదాపు 6.17లక్షల మంది సైనికులు యుద్ధభూమిలో ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని.. వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావన ఉండదని స్పష్టం చేశారు.


దీంతో పశ్చిమ దేశాలు మరోసారి ఉక్రెయిన్ పై దృష్టి సారించాయి. పోతున్న పరువును నిలబెట్టుకునేందుకు కొత్త ఎత్తులను వేస్తున్నాయి. గతం కంటే ఎక్కువగా సైనికులను, క్షిపణులను సమకూర్చాలని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. అయితే రష్యా ఏదైతే జరగకూడదని అనుకుందో అదే జరిగేలా కనిపిస్తోంది. నాటో, యూరప్, అమెరికా దేశాల సైన్యం తమ సరిహద్దుల్లోకి రాకూడదని రష్యా భావించింది.


ఉక్రెయిన్ ను యూరోపియన్ లో కానీ, నాటో లో కానీ భాగస్వామ్యం చేసుకుంటే ఆయా దేశాల సహకారంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. పశ్చిమాసియా దేశాలు రష్యాకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి రష్యాకు పెద్ద ఎదురు దెబ్బే తగిలే అవకాశం ఉంది. యుద్ధం జరుగుతున్న సమయంలో నాటో లో కానీ, యూరోపియన్ లో కానీ చేర్చుకోమని చెప్పిన దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇది ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే తమ పరువు పోతుందని భావించాయి.


దీనికోసం కొత్త ఎత్తులను వేస్తున్నాయి.  రష్యన్ సైన్యం పోలండ్ ను అడ్డు పెట్టుకొని పశ్చిమాసియా దేశాల సరిహద్దుల వరకు వచ్చింది. ఒకవేళ ఉక్రెయిన్ ఓడిపోతే రష్యా సత్తా పెరుగుతుంది. రష్యా నుంచి విడిపోయిన దేశాలన్నీ తిరిగి తమ దేశంలో కలుపుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తారు. దీనిని నియంత్రించాలని నాటో భాగస్వామ్య దేశాలు తమ సైన్యంలోకి అమెరికా సైన్యాన్ని పంపిచాలని అగ్రరాజ్యంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగా అమెరికా సైన్యం రష్యా సరిహద్దుల్లోకి వచ్చి చేరుతోంది. దీనికి ప్రతీకారంగా క్రెమ్లిన్ అమెరికా, ఇతర దేశాలపై యుద్ధం చేస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: