గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో వాణిజ్య పరిశ్రమ రంగంలో నలుగురికి పద్మ అవార్డులు వరించాయి. సీతారామ్ జిందాల్ (కర్ణాటక), యాంగ్ లీ (తైవాన్)లకు పద్మ భూషణ్ దక్కాయి. వీరిలో తైవాన్ కు చెందిన వ్యక్తికి భారత అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో అందరి  దృష్టి ఆయనపై పడింది.


తైవాన్ కు చెందిన ఎలక్ర్టానిక్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ సీఈవో యాంగ్ లీ. ఐఫోన్ తయారలో యాపిల్ సంస్థకు 70 శాతం అతి పెద్ద సరఫరాదారుడిగా ఈ సంస్థ ఉంది. యాపిల్ ఐఫోన్ల అసెబ్లింగ్ చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఇది ఒకటి. కొవిడ్ విజృంభించడంతో ఎదురైన సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చైనా దేశం వెలుపల తయారీ కార్యకలపాలను విస్తరించింది. అందులో భారత్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దక్షిణ భారత దేశంలోని ఉత్పాదక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెట్టింది.


ఎలక్ర్టానిక్ ఉపకరణాల తయారీ విభాగంలో యాంగ్ లీ కు నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాంగ్ లీ మూడు కంపెనీలు స్థాపించారు. 1988లో యాంగ్ మైక్రో సిస్టమ్స్ అనే మదర్ బోర్డు కంపెనీ, 1995లో పీసీ చిప్ సెట్ కోసం ఐసీ డిజైన్ కంపెనీ, 1997లో ఐటెక్స్ ను యాంగ్ లీ  ప్రారంభించారు. భారత్ లోను కొన్ని రాష్ట్రాల్లో ప్లాంట్లను యాంగ్ లీ  నెలకొల్పారు.


సెమీ కండక్టర్ ప్రణాళికల కోసం సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ర్టానిక్ తయారీకి భారత్ ముఖ్యమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. ఇలా దేశంలో సేవలు విస్తరిస్తున్నందుకు గాను యాంగ్ లీ కు పద్మ భూషన్ పురస్కారం లభించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ఏడాది మొత్తం 132 మందకి పద్మ పురస్కారాలు ప్రకటించగా.. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110మందికి పద్మ శ్రీలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: