కాస్త హంగూ ఆర్భాటం ఉన్న వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ రోజుల్లో వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాత వారసత్వాన్ని స్వీకరించాలన్నతల్లి అరుణ కోరిక మేరకు జయదేవ్ రాజకీయల్లోకి వచ్చారని చెబుతుంటారు. ఇటీవల బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


తాను రెండేళ్ల నుంచి ప్రజల మధ్యకు రాలేకపోయినా.. నా కార్యాలయం, నా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. నన్ను రెండు సార్లు  ఆదరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఙుడిని. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ప్రస్తుతం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు తాను కూడా కొన్నాళ్ల తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వస్తానని అప్పటి వరకు తన వ్యాపారాలపైనే దృష్టి పెడతానని సభ్యులకు చెప్పారు.


ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకులు సభలో ఏదైనా ప్రశ్నించాల్సి వస్తే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. నిజాయతీ ఉన్నా కూడా అడిగేందుకు జంకుతున్నారు. దీనికి కారణం వ్యాపారాలు ఉండటమే. ప్రభుత్వ దాడులను సమర్థంగా ఎదుర్కోలేని నాయకులు తీవ్రనష్టాలు చవి చూస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలు టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


అయితే దీని వెనుక వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో రైళ్లలో బ్యాటరీల ఏర్పాటు లో అమర్ రాజా కూడా ఒక కాంట్రాక్టర్.  2019 తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు అయింది. దీంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో పాటు చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపిన తర్వాత హస్తం పార్టీకి ఇచ్చే డబ్బులను టీడీపీ అధినేత గల్లా జయదేవ్ ద్వారా సమకూర్చారు. ఈ విషయాన్ని మనీ ల్యాండరింగ్ ద్వారా ఈడీ పసిగట్టింది. తనపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని స్వయంగా ఆయన చెప్పే వరకు ఎవరికి తెలియదు. ఇంతకీ ఏంటి ఆ కేసు అనేది ఎవరూ చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: