ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించి అతని చేత బలవంతంగా రూ.14 లక్షలకు బాండ్ రాయించుకున్న ఘటనలో ఇటీవల పులివెందుల పోలీసులు శనివారం టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఇది చూస్తే టీడీపీ నేతలు ఏంటి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అనిపిస్తుంది కదూ.. కానీ వాస్తవం వేరే ఉంది. అదేంటంటే.. గుంటూరు కు చెందిన లంకపల్లి సాంబయ్య ఏపీ సెక్రటేరియట్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా ఔట్ సోర్సింగ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతనిని 2022 మార్చిలో పులి వెందుల బ్రాహ్మణపల్లి కి చెందిన గోకనపల్లి హరివర్దన్ రెడ్డి కలిసి తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.


దీంతో సాంబయ్య హైదరాబాద్ లోని జాబ్ కన్సెల్టెంట్ నడుపుతున్న స్వప్నను కలవమని సలహా ఇచ్చాడు. హరివర్దన్, అతని బావ, సాంబయ్య ముగ్గురూ వెళ్లి స్వప్నను కలిశారు. స్వప్న అతనికి రైల్వే డిపార్ట్ మెంట్ లో టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14లక్షల డబ్బులు ఖర్చవుతుందని చెప్పి రూ.1.50 లక్షలను అడ్వాన్స్ గా తీసుకుంది.


45 రోజుల నుంచి 120 రోజుల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నారు. రూ.14లక్షలను పలుదశల్లో హరివర్దన్ రెడ్డి స్వప్నకు చెల్లించారు. కొద్దిరోజుల తర్వాత స్వప్న గుంతకల్లు రైల్వేస్టేషన్ లో అతనికి ఉద్యోగం ఇస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చింది. ఆ పేపర్లు తీసుకొని గుంతకల్లు రైల్వేస్టేషన్ వెళ్లిన హరివర్దన్ రెడ్డి మోసపోయానని గ్రహించాడు. దీంతో తిరిగి పులివెందుల వచ్చి టీడీపీ నేతల అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి, హరివర్దన్ రెడ్డి సాంబయ్య హైదరాబాద్ వెళ్లి స్వప్నను కలిశారు.


ఆమె డబ్బులు కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీంతో విజయ్ కుమార్ సాంబయ్యను పులివెందుల తీసుకొచ్చి నిర్భందించి రూ.14లక్షలకు బాండ్ పేపర్ రాయించుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలపై కిడ్నాప్ కేసు పెట్టారు. మోసపోయిన వారికి డబ్బులు ఇప్పించాలని చూసిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. బాధితులు తెలివిగా దీనిని కిడ్నాప్ కేసు కింద మార్చి టీడీపీ నేతలపై కేసు నమోదు చేయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: