కేంద్ర ప్రభుత్వం పథకం. ఆపై రాష్ట్ర ప్రభుత్వ సహకారం. రెండు కలిస్తే బంగారు కలల గృహం సాధ్యమవుతుందని ఎవరైనా భావిస్తారు. అర్బన్ లో నివసించే ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే తలంపుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశ పెట్టిన పథకం అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు. టిడ్కో పేరుతో రూ.6లక్షలకు ఇల్లు నిర్మించి ఇస్తున్నారు.


ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50లక్షలు కాగా రాష్ట్రం రూ.లక్ష రాయితీ ఇస్తోంది. మిగతా రూ.3లక్షలు లబ్ధిదారులు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. ఇందులో రూ.50వేలు ముందుగా చెల్లిస్తే మిగిలిన రూ.3లక్షల లబ్ధిదారునికి బ్యాంకుల నుంచి రుణం అందిచవచ్చని నిబంధన విధించారు. ఈ అప్పును లబ్దిదారుడే చెల్లించాల్సి ఉంటుంది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం టీడీపీ కార్యకర్తలకే టిడ్కో ఇళ్లు ఇచ్చారనే అపవాదు ఉంది.


అయితే ఈ టిడ్కో ఇళ్లు ఎక్కువ సంఖ్యలో ఏపీకి రావడానికి ముఖ్య కారకుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఏపీకి 20లక్షల ఇళ్లు మంజూరు చేయించారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంత మొత్తంలో ఇళ్లు  కేటాయించలేదు. కానీ వీటిని సద్వినియోగ పరచుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. 20లక్షల ఇళ్లు కట్టించి ఇస్తే చంద్రబాబు  ఆ 20లక్షల కుటుంబాలకు ఆరాధ్య దైవంగా ఉండేవారు అనడంలో సందేహం లేదేమో.


కానీ ఆయన 3లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో 80వేలు పూర్తయ్యే దశకి తీసుకెళ్లారు.  వీటిని అపార్ట్ మెంట్ సిస్టంలో కట్టించారు. చివరకు చంద్రబాబు ఒక్కరికి కూడా ఇంటిని అందించలేకపోయారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత 21లక్షల మందికి పట్టాలు అందజేశారు. ఇందులో గ్రౌండ్ లెవల్లో పనులు ప్రారంభించినవి 19లక్షలు. వీటిలో పనులు పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లు 9లక్షలకు పై చిలుకు. వీటికి మొత్తం రూ.91803 కోట్లు ఖర్చవగా.. కేంద్రం రూ.32567 కోట్లు భరించింది. మిగతా రూ.59236 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే కేటాయించింది. మొత్తంగా 9 లక్షల మందికి జగన్ ఇళ్లను ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: