దేశ వ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తున్న లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసీ 1984 నుంచి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ తర్వాత నుంచి అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే ఉంది.


ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడి నుంచి మాధవీలతను బరిలో దింపింది. ఈమె అక్కడి స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. ఆమెకు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా లేని హైప్ వస్తోంది. ఇది సృష్టిస్తోందా.. లేక స్వతహాగా వస్తుందా అనేది పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో ఆమె అసదుద్దీన్ ఓవైసీని ఢీ కొట్టగలదా? నిజంగా ఎంఐఎంను ఓడించే ఉద్దేశం బీజేపీకి ఉందా? ఉంటే బలమైన రాజాసింగ్ పోటీ చేస్తానంటే వద్దని చెప్పి మాధవీలతను ఎందుకు బరిలో దింపారు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. అవునన్నా కాదన్నా.. ఎంఐఎం తెర వెనుక బీజేపీకి సహకరిస్తూ ఉంటుంది. యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసి మైనార్టీ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న తెలంగాణలో ఒక్క స్థానానికే పరిమితం అయి.. మిగతా రాష్ట్రాల్లో మాత్రం గణనీయ స్థానాల్లో బరిలో ఉంటుంది. తద్వారా ముస్లిం, మైనార్టీ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూరుస్తూ ఉంటుంది.


ప్రస్తుతం ఈ  పార్టీ ఉద్దేశం ముస్లిం నేతలకు అర్థం అయింది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. అందుకే ఈ సారి ఎన్నికల్లో తమపై బీజేపీ బలంగా పోరాడుతుంది అనే హైప్ ని జనాల్లో క్రియేట్ చేయాలని చూస్తోంది. బీజేపీ ఉద్దేశం కూడా అసదుద్దీన్ ని ఓడించడం కాదు. ఆయనపై పోరాడటమే. కానీ జనాలకు తాము ప్రత్యర్థులం అని చెప్పేందుకు మాధవీలతకు హైప్ క్రియేట్ చేసి.. గట్టిగా పోరాడుతుంది అనే నేరేషన్ ను క్రియేట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: