ఏపీలో ఈ సారి భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. మొత్తం 25 జిల్లాలకు చెందిన పోలింగ్ డేటా మొత్తం వచ్చేసింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక కళ్లు చెదిరిపోయే విధంగా భారీ పోలింగ్ కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే.. అనంతపురం దాకా మొత్తం 175 స్థానాల్లో ఎక్కడా కూడా డెబ్బై శాతానికి తగ్గకుండా మరికొన్ని చోట్ల 80శాతాలను కూడా దాటింది.


గత ఎన్నికల్లో 79శాతమే వామ్మో అనుకుంటే.. ఈ సారి అంతకు మించి 81 శాతానికి ఎగబాకింది.  మరి పెరిగిన ఈ రెండు శాతం ఓటర్లు దేనికి సంకేతం అన్నదే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. ఊరికే పోలింగ్ శాతం పెరగదు అనేది వాస్తవం. ఓటర్లు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్ లతో ఉండి మరీ ఓటేశారు అంటే వారి మనోభావాలు ఏలా ఉంటాయో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.


ఎవరి మీద అయినా విపరీతమైన కసి ఉంటే అది పట్టుదలగా మారుతుంది. అలవిమాలిన ప్రేమ ఉన్నా కూడా అది వారిని కట్టి పడేస్తుంది. ఇప్పుడు ఓటరు కోణంలో మనం ఈ రెండు విషయాలను గమనించాలి. ఓటర్ తన మనసులో మాట ఈవీఎంలలో చెప్పినా.. నిబద్ధత ప్రకారం మనం ఒక అంచనాకు రావొచ్చు. విభజన ఏపీని చూసుకుంటే 2014లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. అది చంద్రబాబుని అధికారంలోకి తెచ్చింది. 2019లో పెరగిన ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా మారింది.


ఇప్పుడు పెరిగిన పోలింగ్ ఎవరిని ముంచుతుందో.. ఎవర్నీ ఒడ్డున పడేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. 2019లో కూడా అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉండి మరీ ఓటేసి వైసీపీని గద్దెనెక్కించారు. ఇప్పుడు కూడా అధికార పార్టీ పట్ల కోపం అని టీడీపీ నేతలు చెప్పుకొంటున్నారు. మరికొందరు జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ ఓటు ద్వారా మద్దతు తెలిపేందుకు అని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి భారీ పోలింగ్ మాత్రం ఏపీలో రాజకీయ జాతకాన్నే మలుపు తిప్పేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: