గాంధీ కుటుంబంలో నవతరం వారసులుగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈ ఇద్దరిలో ప్రియాంగా గాంధీ కాస్త దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని పేరు ఉంది. ఆమె తన నానమ్మ ఇందిరా గాంధీని పోలి ఉంటారు. అంతే కాదు ఆమె ప్రసంగాలు సైతం పదును తేలి ఉంటాయి. బీజేపీ నేతలకు సెటైరికల్ గా కానీ.. డైరెక్ట్ గా కానీ ధీటైన జవాబు ఇవ్వడంలో ఆమె ఎప్పుడు ముందుంటారు.


ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలతో పాటు బయటి పక్ష నేతలు కూడా ఒప్పుకుంటారు. ఇదిలా ఉంటే తన రాజకీయ జీవితం గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి తాజాగా ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధాని మోదీ మీద సునిశిత విమర్శలు చేశారు. అమేథీ, రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబం పారిపోతుంది అని ప్రధాని పదే పదే చేస్తున్న విమర్శలకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు.


2014లో గుజరాత్ లోని వడోదరా నుంచి పోటీ చేసిన మోదీ ఆ తర్వాత ఆ సీటును ఎందుకు వదిలేశారు అని ప్రశ్నించారు. ఆ సీటులో గెలవమని భయమా లేక పారిపోవడం గానే దీనిని చూడాలా అంటూ ప్రధాని మోదీని సూటిగానే ప్రశ్నించారు. ఇదే సమయంలో అమేథీ, రాయబరేలీ నుంచి తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని నొక్కి చెప్పారు. తాము ఎప్పటికి కంటికి రెప్పలా ఈ రెండు సీట్లను కాపాడుకుంటామని చెప్పారు.


ఈ సారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదనే దానిపై క్లారిటీ ఇస్తూ.. ఒకవేళ పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సమయం సరిపోదు. పూర్తి సమయం తక్కువలో తక్కువ 15 రోజులైన ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయాలి. ఇది బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి ప్రచారానికి పరిమితం అయ్యాను అని వివరించారు. భవిష్యత్తులో పార్టీ ఆదేశిస్తే.. ప్రజలు కోరుకుంటే మాత్రం తాను తప్పకుండా పోటీ చేస్తాను అని అన్నారు. మొత్తం మీద ప్రియాంకా గాంధీ పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: