అవును అధికారపార్టీలో ఇపుడిదే చర్చ జోరుగా సాగుతోంది. వైజాగ్ లో నిర్మించబోయే ఎగ్జిక్యూటివ్ రాజధాని నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడినే పిలవబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. 2015లో అమరావతిలో రాజధాని నిర్మాణ శంకుస్ధాపన కూడా అప్పట్లో నరేంద్రమోడి చేతుల మీదుగానే చంద్రబాబు చేయించిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఆ తర్వాత అదే ప్రాంతంలో చంద్రబాబు కొందరు కేంద్రమంత్రులను పిలిపించి అనేక శంకుస్ధాపనలు చేయించాడు. దాంతో శంకుస్ధాపన కార్యక్రమాలు పెద్ద ప్రహసనంగా మారిపోయాయి. శంకుస్ధాపన కార్యక్రమాలకే అప్పట్లో చంద్రబాబు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయటమే పెద్ద విచిత్రం. ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు పెద్ద ఈవెంటుగా నిర్వహించేవాడు. సరే ఆ తర్వాత ఆ శంకుస్ధాపనలన్నీ ఏమైనాయో అందరు చూసిందే.




సీన్ కట్ చేస్తే కాలం గిర్రున తిరిగి 2019 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయాడు. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ నిర్ణయించాడు. ఆగష్టు నుండే కొత్త రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయని, అక్టోబర్ లో విజయదశమి రోజున శంకుస్ధాపన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శంకుస్ధాపన కార్యక్రమం ఎప్పుుడు జరిగినా ప్రదానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదగానే జరిపించాలని జగన్ డిసైడ్ చేశాడట. కాకపోతే చంద్రబాబు హయాంలో ప్రహసనం జరిగినట్లు కాకుండా కచ్చితంగా శంకుస్ధాపన తర్వాత నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టేయాలని జగన్ అనుకున్నాడు.




నిజానికి శంకుస్ధాపన కార్యక్రమానికి పిలవటం ద్వారా నరేంద్రమోడిని చంద్రబాబు చాలా పలుచన చేసినట్లే అనుకోవాలి. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్ధాపన చేసినా పనులు మొదలుకాలేదంటే ఏమనుకోవాలి. చంద్రబాబు పిచ్చి చేష్టలతో, తలతిక్క ఆలోచనలతో అమరావతిని కాస్త భ్రమరావతిగా చేతులారా మార్చేశాడు. ప్రజలను మోసం చేసే క్రమంలోనే చంద్రబాబు తనను తాను మోసం చేసుకున్నాడు. తన నెత్తిన చెత్త వేసుకోవటమే కాకుండా ప్రధానమంత్రి నెత్తిన కూడా చెత్తవేశాడు. అందుకనే రాజధాని నిర్మాణం పూర్తిగా నవ్వుల పాలయ్యింది. ఈ దశలోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. దాంతో కొద్దిపాటి అయోమయం నెలకొంది. మొత్తానికి అసెంబ్లీలో బిల్లులు పాసవ్వటం, కౌన్సిల్ లో బిల్లులు పెట్టినపుడు డీమ్డ్ టు బి అప్రూవడ్ అనే పద్దతిలో బిల్లులు గవర్నర్ దగ్గర కూడా ఆమోదం పొందాయి.




ఈ నేపధ్యంలోనే వైజాగ్ లో రాజధాని నిర్మాణం అంశంలో వేడి మొదలైంది. వైజాగ్ లో రాజధాని నిర్మాణానికి తొందరలోనే శంకుస్ధాపన జరుగటం ఖాయం. జరగబోయే శంకుస్ధాపన ఎవరితో చేయించాలనే ప్రశ్న వచ్చిందట. అప్పుడు శంకుస్ధాపనకు ప్రధానమంత్రినే ఆహ్వానించాలనే ప్రతిపాదన వచ్చింది. వెంటనే జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంటే ఒకే అంశం మీద రెండోసారి మోడి శంకుస్ధాపన చేసినట్లవుతుంది. ఇదే జరిగితే చంద్రబాబు హయాంలో జరిగినట్లు కాకుండా రాజధాని నిర్మాణ పనులను స్పీడుగా చేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి మోడి గనుక శంకుస్ధాపన చేస్తే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా నోరిప్పేందుకు లేదు. మొత్తానికి చంద్రబాబు మీదకు ప్రధానినే జగన్ ప్రయోగించబోతున్నట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: