ఓజీ సినిమా రిలీజ్ అవుతుండటం అభిమానులకు ఎంతో  సంతోషాన్ని కలిగిస్తోంది. ఓజీ సినిమా పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి  బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఓజీ చూడటానికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ AMBలో సినిమాను  చుడనున్నారని తెలుస్తోంది.

రాజమౌళి,  ప్రశాంత్ నీల్, అకీరా నందన్, దర్శకుడు మారుతి, మరి కొందరు సెలబ్రిటీలు ఈ సినిమాను విమల్ థియేటర్ లో  చుడనున్నారని సమాచారం అందుతోంది. ఇంతమంది సెలబ్రిటీలు థియేటర్లలో ప్రీమియర్ షోను చూడటం చాలా అరుదుగా జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృస్తిస్తుందో చూడాల్సి ఉంది.

ఓజీ సినిమా  టికెట్ రేట్లను సంబంధిత అధికారులు అప్రూవ్ చేస్తారని టికెట్ రేట్ల విషయంలో  గందరగోళం అవసరం లేదని తెలుస్తోంది. ఓజీ సినిమా ఫస్ట్  డే కలెక్షన్లతోనే 100 కోట్ల రూపాయల మార్కును  అందుకునే అవకాశాలు ఉన్నాయి.  ఓజీ సినిమా ఫస్ట్  వీకెండ్ లోనే సులువుగా 250 నుంచి 300 కోట్ల రూపాయల కలెక్షన్లను ఖాతాలో వేసుకునే  ఛాన్స్ ఉంది.

ఓజీ సినిమా భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే  మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఓజీ సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందించగా రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉంది. ఓజీ రికార్డుల పరంపర ఇప్పటికే మొదలైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

og