టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకుని మరి నటించిన చిత్రం ఘాటి. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ పైన కూడా భారీ దెబ్బ పడినట్లు తెలుస్తోంది. ఘాటి సినిమా విడుదలైన కేవలం మూడు వారాలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 26వ తేదీన ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.


తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా డిజిటల్ స్ట్రిమింగ్ కాబోతోంది ఘాటి. సినిమా విడుదలైన సమయంలో మిక్స్డ్ రివ్యూలు, బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో కేవలం సినిమా విడుదలైన 20 రోజులలోపే ఓటీటి లోకి రావడంతో చాలామంది అభిమానులు ఆనందపడుతున్నప్పటికీ మరి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు. కనీసం నెలరోజుల తర్వాత అయినా వచ్చి ఉంటే బాగుండు.. అనుష్క ఘాటి సినిమా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదని టాక్ వినిపిస్తోంది.



సినిమా మొత్తం గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కించినప్పటికీ పెద్దగా ఇందులో ఊహకందని సన్నివేశాలు, సర్ప్రైజ్ వంటివి ఏవి కనిపించలేదు. అనుష్క కనిపించే సన్నివేశాలు తప్ప పెద్దగా ఈ సినిమాలో హై మూమెంట్స్ ఏవి కనిపించలేకపోవడంతో అభిమానులు కూడా నిరాశపడ్డారు. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ .7కోట్లలోపు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మూవీ మేకర్స్ కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ వల్ల కూడా అనుష్కకు భారీ దెబ్బ పడిందని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఇటీవలే అనౌన్స్మెంట్ చేసింది. మరి తన తదుపరిచిత్రంతో నైనా అనుష్క తన స్టామినా  నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: