ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం తారస్ధాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. చిలికి చిలికి గాలివానలాగ తయారై ఇపుడు ప్రివిలేజ్ కమిటికి మంత్రులు ఫిర్యాదు చేసేదాక చేరకుంది.  కమిటి కూడా ఫిర్యాదుపై ఒకసారి సమావేశమై రెండోసారి సమావేశమవ్వాలని డిసైడ్ చేసింది. కాబట్టి ముందు ముందు ఏమి జరుగుతుందన్నది సస్పెన్సే. ఎప్పుడైతే నిమ్మగడ్డ అంశంపై ప్రివిలేజ్ కమిటి సమావేశమైందో తెలుగుదేశంపార్టీ అలర్టయిపోయింది. ఎలాగైనా నిమ్మగడ్డపై ప్రివిలేజన్ కమిటి యాక్షన్ తీసుకోకుండా అడ్డుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. నేతల్లో చాలామంది నిమ్మగడ్డకు మద్దతుగా నిలబడ్డారు. నిమ్మగడ్డ మీద ఫిర్యాదు చేసే హక్కు మంత్రులకు లేదని, ఫ్రివిలేజ్ కమిటికి నిమ్మగడ్డ మీద ఫిర్యాదును విచారించే అర్హత లేదని ఇలా ఏవేవో మాట్లాడేస్తున్నారు.




సీనియర్ నేత, మాజీమంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాజిక్ ఏమిటంటే సభా హక్కులన్నవి ఎంఎల్ఏలకు మాత్రమే ఉండే హక్కట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యానారాయణ మంత్రులు కాబట్టి వారి ఫిర్యాదు సభహక్కుల కిందకు రాదట. నిజంగా సోమిరెడ్డిది ఎంత చెత్త లాజిక్కో ఇక్కడే అర్ధమైపోతోంది. బొత్సా అయినా పెద్దిరెడ్డి అయినా మంత్రులయ్యారంటే అంతకముందు ఎంఎల్ఏలన్న విషయాన్ని సోమిరెడ్డి మరచిపోయారు. కాబట్టి ఎంఎల్ఏలకు ఎటువంటి హక్కులుంటాయో అవన్నీ మంత్రులైన తర్వాత కూడా కంటిన్యు అవుతాయని సోమిరెడ్డి మరచిపోయారు. పైగా ఎన్నికల కమీషనర్ పై విచారణ జరిపి శిక్షించే అధికారం ప్రివిలేజ్ కమిటికి, అసెంబ్లీ, స్పీకర్ కు లేదంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారు.




మహారాష్ట్రలో ఇదే తరహా వివాదా తారస్ధాయికి చేరుకుంటే అక్కడ ఎన్నికల కమీషనర్ కు అప్పటి స్పీకర్ జైలుకు పంపిన విషయాన్ని సోమిరెడ్డి మరచిపోతున్నారు. కమీషనర్ ను జైలుకు పంపే అధికారం స్పీకర్ కు లేదని చెప్పింది వాస్తవమే. అయితే శాసన వ్యవస్ధ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని స్పీకర్ గట్టిగా బదులివ్వటంతో కోర్టు కూడా ఏమీ చేయలేకపోయింది. కాకపోతే మధ్యవర్తిత్వం ద్వారా సంప్రదింపులు జరిగిన కారణంగా వారం రోజుల జైలుశిక్షను రెండు రోజులకు కుదించారు స్పీకర్. మొత్తానికి అప్పటి కమీషనర్ రెండురోజుల పాటు జైలుశిక్షను అనుభవించిన విషయాన్ని టీడీపీ నేతలు మరచిపోయినట్లు నటిస్తున్నారు. చూద్దాం కొద్దిరోజుల్లో ఏ సంగతి తేలిపోతుంది కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: