కేసీఆర్, జగన్.. ఇద్దరూ ఇప్పుడు తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్న నాయకులే.. అంతేకాదు.. ఇద్దరూ కరోనా పట్ల అంతగా భయంలేని నాయకులే. కరోనా పారాసిటమాల్‌తో పోతుందని కేసీఆర్ అంటే.. కరోనాతో సహజీవనం తప్పదని జగన్ మొదట్లోనే చెప్పేశారు. అంతే కాదు.. ఈ ఇద్దరు నేతలు పెద్దగా కరోనా జాగ్రత్తలు పాటించినట్టు కూడా కనిపించరు. కేసీఆర్ అయితే ఏకంగా గాంధీలోని కరోనా వార్డుల్లోనూ మాస్కు లేకుండా తిరిగిన మాస్ లీడర్. ఇక జగన్ సంగతి చెప్పనక్కర్లేదు.


ఇదంతా ఎందుకు చెప్పాలంటే.. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలూ కరోనా అంటే భయపడుతున్నారు. కరోనా ఎక్కడ తమ రాష్ట్రాలకు చుట్టుమడుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు. అబ్బే అలా ఏమీ అనిపించడం లేదంటారా.. అవును మరి ఈ ఇద్దరు నేతలు ఈసీకి ఇదే సమాధానం ఇచ్చారు. ఏమయ్యా కేసీఆర్‌, ఏమయ్యా జగనూ.. మీ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు పెట్టాల్సిన స్థానాలు ఉన్నాయి కదా.. మరి ఎన్నికలు పెట్టేద్దామా.. ఏమంటారు అని ఈసీ వీరిని వివరణ అడిగితే.. వీరేం చెప్పారో తెలుసా.. బాబోయ్.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదండీ.. ఇంకాస్త ఆగితే మంచిది.. అసలే మంచి పండగల సీజన్ కదా.. ఆ సీజన్ అయ్యాక ఉప ఎన్నికలు పెట్టుకుందాం లెండి అని సమాధానం ఇచ్చారట.


ఇప్పుడు ఈ సమాధానం చూస్తే.. ఇంతకీ వీళ్లు బయటపడుతున్నది కరోనాకా.. ఉప ఎన్నికలకా అన్న అనుమానం రాకుండా మానదు. ఎందుకంటే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ తెలంగాణలో ఎన్నికలు జరిగాయి.. సాగర్ ఉపఎన్నిక సమయంలో కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. అప్పుడే కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఏపీలో కరోనా ఉన్నప్పుడే అన్ని రకాల ఎన్నికలు జరిగాయి. సో.. వీరు భయపడుతున్నది కరోనాకు కాదు.. ఉపఎన్నికలకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే కేసీఆర్ హూజూరాబాద్ ఉపఎన్నికకూ.. జగన్ బద్వేల్ ఉపఎన్నికకూ భయపడుతున్నారా.. అంటే.. అంతేగా..అంతేగా.. అని చెప్పకతప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: