వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఐదో ఆరో అసెంబ్లీ సీట్లు, ఒక‌టో రెండో ఎంపీ సీట్లు సాధించి.. పాత రోజులు తెచ్చుకోవాల‌ని, పార్టీకి పున‌ర్వైభ‌వం సాధించాల‌ని బీజేపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. ఎక్క‌డ మాట్లాడినా.. ఎప్పుడు మాట్లాడినా.. ఎవ‌రు మాట్లాడినా. ఏపీలో అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్నారు. ఇక‌, ఏపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజు కూడా అదికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్నా.. ఆయ‌న ఆలోచ‌న‌లు మాత్రం పార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. ఆయ‌న వ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది.

పార్టీలోని సీనియ‌ర్ల అభిప్రాయం మేర‌కు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి అడుగులు వేయ‌డం ద్వారా.. పార్టీ పుంజుకుంటుంద ని అంటున్నారు.అందుకే.. జ‌న‌సేనతో క‌లిసి ప‌నిచేయాల‌ని కూడా భావిస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో జ‌న‌సేన ఆలోచ‌న‌లు టీడీపీని కూడా క‌లుపుకొని.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌కుండా.. ప్ర‌జ‌ల‌లోకి వెళ్లాల‌ని ఉంది. అయితే.. దీనిని సోము వీర్రాజు బాహాటంగానే వ్య‌తిరేకిస్తున్నారు. టీడీపీతో జ‌ట్టుక‌ట్టే విధాన‌మే ఉంటే.. తాము త‌మ దారి చూసుకుంటామ‌ని అంటున్నారు. ఇది పార్టీలో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఏదో ఒక పార్టీతో క‌లిసి ఉంటే త‌ప్పేంట‌ని మెజారిటీ నాయ‌కులు అంటున్నారు.

అంతేకాదు.. టీడీపీ అయినా.. వేరే పార్టీ అయినా.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌తృవులు ఉండ‌వ‌ని.. ఎప్పుడైనా.. ఏదో ఒక పార్టీతో క‌లిసి ఉంటేనే ఏపీలో బీజేపీకి భ‌విత‌వ్యం ఉంటుంద‌ని.. నాయ‌కులు స్థిర నిర్ణ‌యంతో ఉన్నారు.కానీ, సోము మాత్రం.. టీడీపీని ఇప్ప‌టికీ.. దూరం పెడ‌తామ‌ని.. అది త‌మ విధామ‌ని చెబుతున్నారు. దీనిని మెజారిటీ నాయ‌కులు విభేదిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాన్నాళ్లుగా.. నాయ‌కులు.. ఎక్కువ మంది సోము ను మార్చాలంటూ. డిమాండ్ చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ సోము ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న బ‌ల‌మైన లాబీయింగ్ కార‌ణంగా.. ఆయ‌న‌ను ఎవ‌రూ క‌ద‌ల్చ‌లేక‌పోతున్నారు.

అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న స‌మ‌యం అయిపోతుంద‌ని.. క‌నుక‌.. ఈ ప్లేస్‌ను స‌త్య‌కుమార్‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. ఇప్ప‌టికిప్పుడు సోము అవలంభిస్తున్న విధానం మాత్రం పార్టీకి న‌ష్టం.. క‌ష్టం రెండూ చేస్తుంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఆ య‌నే మార‌తారో.. ఆయ‌న‌నే మార్చే వ‌ర‌కు ఎదురు చూస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: