భూమి.. ప్రతి ఒక్కరి కల.. సొంత భూమి ఉండాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు.. అలాగే తమకు ఉన్న భూమిని ఎలాంటి వివాదాలు లేకుండా పక్కా కాగితాలతో ఉండాలని అంతా కోరుకుంటారు. అందుకే.. ఏపీ ప్రభుత్వం భూముల రికార్డుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటోంది. భూముల సర్వే విషయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా  సంచలన నిర్ణయం తీసుకుంది.


జగనన్న శాశ్వత భూహక్కు రీసర్వే పనుల కోసం ప్రయోగాత్మకంగా విమానాలను కూడా వినియోగించాలని భావిస్తున్నారు. ఈమేరకు ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ , ల్యాండ్ రికార్డుల కమిషనర్ సిద్ధార్ధ జైన్ మీడియాకు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, యడ్లపాడు తహశీల్దార్ కార్యాలయలలో జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకానికి సంబంధించి రీసర్వే పనుల రికార్డులను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రీసర్వే పనులను ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ , ల్యాండ్ రికార్డుల కమిషనర్ సిద్ధార్ధ జైన్ తనిఖీ చేశారు.


రీసర్వే పురోగతిపై జిల్లా, స్థానిక అధికారులతో ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ , ల్యాండ్ రికార్డుల కమిషనర్ సిద్ధార్ధ జైన్ సమీక్షించారు. ఇప్పటికే కర్నూలు, నంద్యాల ప్రాంతాలలో విమానాలతో రీసర్వే చేపట్టినట్లు ల్యాండ్ సర్వే సెటిల్మెంట్ , ల్యాండ్ రికార్డుల కమిషనర్ సిద్ధార్ధ జైన్ తెలిపారు. ఎవరు ఎక్కడ ఉన్నా సెల్ ఫోన్ లో తమ సొంత భూమి ఉనికిని గుర్తించే విధంగా రీసర్వే పనులు పూర్తి చేస్తున్నట్లు సిద్ధార్ధ జైన్ వివరించారు.


ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వేకు సంబంధించి 80 డ్రోన్లు  ఉపయోగిస్తున్నారు. ఇంకా 1000 రోవర్లు కూడా ఈ పనిపై పని చేస్తున్నాయట. ఇప్పటికే ఏపీలో 4 వేల గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తయిందని సిద్ధార్ధ జైన్ చెబుతున్నారు. అలాగే.. 2 వేల గ్రామాలలో గ్రౌండ్ సర్వే జరుగుతుందని సిద్ధార్ధ జైన్ వివరించారు. 450 గ్రామాలలో రీసర్వే పనులు పూర్తిచేశామన్న సిద్ధార్ధ జైన్.. వచ్చే ఏడాది సెప్టెంబరు కల్లా రీసర్వే పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: