మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో ముందుకు వెళ్లేలా కనిపిస్తుంది. ఎదుటి దేశాల ఆర్థిక వ్యవస్థను కూలబడటం మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పనసాగడం ఒక విధంగా చెప్పాలంటే ముందుకు వెళ్లడం అని అనొచ్చు ఆర్థిక వ్యవస్థను మన దేశం ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది.  ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థ ఎదగాలని మోడీ భావించడం మనందరికీ తెలిసిందే అయితే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది భారత ఆర్థిక వ్యవస్థని మరింత గాడిలో పెట్టేందుకు ముమ్మర ప్రయత్నానికి కొనసాగుతూనే ఉన్నాయి.


బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కాస్త వెనకబడిపోయింది. బ్రెగ్జిట్ వివాదం వల్ల ఆర్థిక మందగమనంలోకి వెళ్లింది. కాబట్టి మన దేశం దాన్ని దాటేసి ముందు వరుసలోకి వచ్చేసింది. వేరే దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడం.. అదే సమయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ముందు కెళుతోంది. దీంతోనే భారత్ ముందుకు దూసుకుపోతుంది. ఒకరి వెనకబాటు మరొకరికి అవకాశం ఇస్తుందని తెలుసు.. దాన్ని అవకాశంగా మలుచుకొని ముందు వరుసలోకి దూసుకెళ్లడం ద్వారా  మనం మనస్థానాన్ని మెరుగుపరుచుకోవచ్చు.


ఇదే అదనుగా భావించి మనం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జర్మనీ, జపాన్ దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే బలంగా తయారు కావడం మన దేశం ముందున్న లక్ష్యం. జర్మన్ లో చాలా సంవత్సరాల తర్వాత ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దానికి ఆదేశంలో ఉన్న వివిధ కారణాలు. జర్మనీ 4.2 ట్రిలియన్ డాలర్లు, జపాన్ 4.9  ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంది. మరి భారత్ పరిస్థతి 3.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కాబట్టి జర్మన్లో నెలకొన్న  వివాదాలు దాని ఆర్థిక వ్యవస్థను దిగజార్చే స్థితిలో ఉంది. దీంతో భారత్ నాలుగో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: