
ఇండియాలో లేబర్ వ్యవస్థ కూడా గతంలో గా లేదు. ప్రస్తుతం చైనాలో యాపిల్ సంస్థ లాక్ డౌన్ ప్రకటించింది. అక్కడ జీతాలు లేక ఉద్యమాలు చేశాక చిర్రెత్తుకొచ్చిన యాపిల్ లీజ్ అగ్రిమెంట్ ను క్యాన్సల్ చేసుకుంది. ప్రస్తుతం యాపిల్ సంస్థ వియత్నాంలో 111 ఎకరాల స్థలం తీసుకొంది. 2057 సంవత్సరం వరకు అక్కడ తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని అగ్రిమెంట్ చేసుకుంది.
దీనికి మూడు వందల మిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల వ్యాపారాన్నియాపిల్ సంస్థ భారత్ లో కొనసాగిస్తుంది. యాపిల్ సంస్థ అధిపతి కుక్ మాట్లాడుతూ చైనాతో విభేదాల వల్ల ఐఫోన్ 14 ప్రో కి సంబంధించిన ఇతర విభాగాల పనులు వియత్నాం, భారత్ లలో చేస్తామని చెప్పారు.
నైకి, ఐకియా, సామ్ సంగ్, అడిడాస్ కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ప్రధానంగా సెమీ కండక్ట్ లను తయారు చేసే డెల్ సంస్థ తమ కంపెనీని చైనా లో మూసివేసింది. కెనాన్ కెమెరాలు తయారు చేసే కెనాన్ సంస్థ కూడా చైనాలో తమ కార్యకలాపాలను వద్దనుకుంది. సోని కెమెరా మేకింగ్ ఆపేసింది. వీళ్లలో కొందరు థాయ్ లాండ్, వియత్నాం, ఇండియా కు వెళుతున్నారు. మొత్తంగా చూస్తే స్మార్ట్ పోన్ల ఎగుమతిలో 16 శాతం భారత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చుకుంటే భారత్ ఎంతో మెరుగుపడిందని చెప్పవచ్చు.