భారత దేశం మీద ఏదైనా ఆంక్షలు పెట్టడానికో ఏవైనా చట్టాలు తీసుకురావడానికో ఐక్యరాజ్యసమితి లోనో, ఇతర విభాగాల్లోనే ప్రయత్నిస్తున్నపుడు మన లాబీయిస్టులు అమెరికాలో ప్రయత్నిస్తారు, పాకిస్తాన్ మన మీద ఏదైనా బురద జల్లేటప్పుడు, అలాంటప్పుడు మన లాబీయిస్టులు అక్కడ ప్రయత్నిస్తారు. ఇప్పుడు భారత దేశంలో విదేశీ లాబీయిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఏ విదేశీయులు అంటే ఉక్రెయిన్ వాళ్ళు అని తెలుస్తుంది.


మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని జోక్యం చేసుకొని రష్యా తో మాట్లాడి యుధ్ద విరమణ చేయించి ఏదో ఒక మధ్యే మార్గ పరిష్కారం తీసుకురమ్మంటున్నారు. ఇది మనం చెప్పట్లేదు. ఉక్రెయిన్ కి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు అధికారికంగా చెబుతున్నటువంటి అంశం. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ సహాయం చేయగలరా అనేది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్న ప్రశ్న.


వ్లాదిమిర్ పుతిన్ మరియు జెలెన్స్కీ మధ్య భారతదేశం మధ్యవర్తి అవుతుంది.  యంగెస్ట్ ఉక్రెయిన్ ఎన్వీ ఫివోల్క్ సోవ్ ఉరాష్ హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ వీడియో ఎడిటర్ అదితి ప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ దేశాల మధ్య చర్చలలో సహాయం కోసం భారతదేశాన్ని ఒప్పించేందుకు తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.


కొంతమంది ఉక్రెయిన్ అధికారులు మాట్లాడుతూ భారతదేశంలో మోడీ ప్రభుత్వంతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నారని చెప్తూనే, నా బృందం ఒకటి ఇండియాలో  ఆల్రెడీ లాభీ చేస్తున్నారు అని చెప్పారు. మరి సమస్య ఏంటి అంటే నాలుగు ప్రాంతాలను వదిలేస్తే యుద్ధం ఆపడానికి పుతిన్ సిద్ధం.  

యుద్ధం ఆపేయండి నాటోలో చేరబోమని హామీ ఇస్తాం, కావాలంటే రాసి ఇస్తాం, పార్లమెంటులో చట్టం చేస్తాం అని అంటున్నాడు జెలెన్స్కీ. ఈ రెండిటి మధ్యే మార్గం పరిష్కారమే తేలనటువంటిది. మరి ఈ లాబీయిస్టులకి తలవొగ్గి మోడీ ఏమైనా చేస్తాడా అంటే ఉక్రెయిన్ వాళ్ళు నాలుగు వదిలేసుకుంటాం యుద్ధం ఆపేయండి అంటే మోడీ పుతిన్ తో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: