ఇండియాలో మత్తు పదార్థాలకు బానిసలయ్యే వారు ముఖ్యంగా మందుతాగడం, ఆ తర్వాత గంజాయి, కొకైన్ లాంటివి వాడుతూ మత్తులో బతుకుతున్నారు. దీని వల్లే యువతరం చెడిపోతున్నారు. అయితే అమెరికాలో ఇంతకు మించి యువత మత్తులో బతుకుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అనే మత్తులో బతికడంఇష్టపడే వారి సంఖ్య పెరిగిపోతుంది.


గుర్రాలు, ఆవులు, గొర్రెలపై వాడేందుకు జీలాబిన్ అనే దాన్ని 1962 సంవత్సరంలో తయారు చేశారు. దీన్ని అప్పట్లో మనుషులపై ప్రయోగం చేశారు. అయితే శ్వాస కోశ ఇబ్బందులు రావడం, హృదయ స్పందన తగ్గిపోవడం లాంటివి జరగడంతో నిలిపివేశారు. 2000 సంవత్సరం నుంచి డ్రగ్ బానిసలు దీన్ని హెరాయిన్ తో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. కొకైన్ తో కలిపిన ఇది ప్రాణంతకమే. కానీ పెంటనీల్ చౌక కావడంతో ఎక్కువగా దాన్ని వాడుతున్నారు.


జీలాబిన్, పెంటనీల్ మిశ్రమ డ్రగ్ వాడకం 2011 లో మొదలైంది. వానలు ఎక్కువగా ఉండే ఫిలడెల్పియాలో ని కింగ్ జెన్ ప్రాంతాల్లో కరోనా సమయంలో ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. అమెరికాలో ఇప్పడు దీని వాడకం ఎక్కువైంది. కేవలం పశువుల డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటే ఎంతైనా  దొరుకుతుంది. ఇది మూడు నాలుగు డాలర్లకే దొరుకుతుంది. ఇళ్లు, వాకలి లేని డ్రగ్స్ కు బానిసైన చాలా మంది అమెరికన్లు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. జీలాబీన్ అనేది చర్మాన్ని తినేస్తున్నప్పటికీ దాన్ని వాడటంలో బానిసలైన వారు ఏ మాత్రం తగ్గడం లేదు. దీన్ని ప్రస్తుతం అమెరికాలో జాంబిడ్రగ్ అని పిలుస్తున్నారు.


ఇది చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుంది. రక్తనాళాలు పొడవవుతాయి. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. చర్మం ఊడటంతో పాటు ఒళ్లంతా పుండ్లు పడతాయి. పుండ్లు ముదిరి ఆ అవయవాలు చెడిపోతున్నాయి. అప్పడు ఆ అవయవాలను తొలగిస్తున్నారు. దీనితో మతిమరుపు కూడా వస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్న దీన్ని మాత్రం వాడటం అమెరికాలో ఏ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: