నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ పగిలి చాలా రోజులైంది. ఈ విషయంలో మొదట రష్యాని దొంగని చేయడానికి చూసింది అమెరికా. ఆ టైంలో రష్యా ఇంకా ఉక్రెయిన్ ఇద్దరూ కలిసి చేశారని నమ్మింది. సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత చేసింది అమెరికానే అనే నిజం తెలుసుకుంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఒక సంవత్సరం పూర్తయింది. యూరప్ దేశాలు సంక్షోభంలో పడటానికి ఈ పైప్ లైన్ కూడా ఒక కారణం అయ్యింది.


తన మాట వినకుండా రష్యా‌ నుండి ఆయిల్ ని కొంటుందన్న  కోపంతో నేరుగా చేయకుండా రష్యా వంక చూపించి రష్యానే పేల్చిందంటూ చూపించింది అమెరికా. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని అమెరికానే పేల్చిందని మరోసారి రష్యా తేల్చి చెప్పింది. గత సెప్టెంబరులో రష్యా క్రెమ్లిన్ ఈవెన్ కు సంబంధించిన నార్డ్ స్ట్రీమ్ బంక్ ఇంకా 2 గ్యాస్ పైప్‌లైన్‌ల విధ్వంసం విషయంలో ఇన్వెస్టిగేషన్‌పై  పశ్చిమ దేశాలతో ఘర్షణ పడింది.  


డెన్మార్క్, స్వీడన్ మరియు జర్మనీలు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తులో మాస్కోకు ఎలాంటి ప్రమేయం లేదని రష్యా రాయబారి వాసిలీ అలెక్సేవిచ్ నెబెంజియా UN సెక్రటరీ కౌన్సిల్‌కు తెలిపారు. అయితే పేలుళ్లపై అంతర్జాతీయమైన ఇన్విస్టిగేషన్ ను UN కార్యదర్శి ఆంటోనీ గుటెరాస్‌ చేయిస్తారా అనేది పూర్తిగా విశ్వసించడానికి లేదని మిగిలిన దేశాలు అంటున్నాయి.


ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం మీద దర్యాప్తు అంటూ అమెరికా యూరప్ దేశాల భాగస్వాములతో ఒక దర్యాప్తు చేయించేసి జర్మనీ, డెన్మార్క్ ఇట్లాంటి వారందరితో వాళ్లు కలిసి ఇది రష్యానే చేసిందని చెప్పేస్తారు. ఈ నాటకానికి తెర తియ్యబోతుంటే వాళ్ళతో చెప్పించడం ఏంటి? అవసరం అయితే ఐక్యరాజ్యసమితి చీఫ్ తో చెప్పించండి, అప్పుడు నమ్ముతాం అంటుంది రష్యా. ఇది అమెరికాపై రష్యా ఎదురు దాడి చేయడానికి పన్నిన వ్యూహం ఏమో అని కొన్ని దేశాలు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: