రష్యా లోని వివిధ ప్రాంతాలను విధ్వంసం చేశాయి కొన్ని డ్రోన్లు. దీన్ని చేసింది ఉక్రెయిన్ అనుకుంటే పొరపాటే. తనతో స్నేహంగా ఉండే బెలారస్ వాళ్లే ఇలా చేశారు. బెలారస్ లో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ తను చెప్పిన విధంగా వ్యవహరించే పార్టీకి చెందిన వ్యక్తిని బెలారస్ అధ్యక్షుడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నియమించారు.


ఇక్కడే రష్యాకు, బెలారస్ లో ఉన్న మాజీ పార్టీలకు చెందిన వారికి పడటం లేదు. వారు రెబెల్ గా మారి రష్యాలోని మాస్కో, వివిధ పట్టణాలలో డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు. రష్యా కేంద్రంగా ఎటాకింగ్ చేశారు. దీనికి మరో కారణం బెలారస్ ఉండే ప్రజా స్వామ్యవాదులను, తన మాట వినని వారి ప్రాణాలను పుతిన్ తీయించారు.


అంటే ఎంతటి దారుణమైన హింస చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు. బెలారస్ అధ్యక్షుడు  మాత్రం పుతిన్ కు దగ్గరయ్యారు. మిగతా వారు మాత్రం బెలారస్ లో తీవ్రవాదులుగా మారారు. బెలారస్ అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్న వారిని ప్రజలుగా, వ్యతిరేకంగా మారిన వారిని తీవ్రవాదులుగా అభివర్ణిస్తున్నారు. కొందరేమో తీవ్రవాదులు కాదు.. వారు పోరాటయోధులు అని చెబుతున్నారు. బెలారస్ తీవ్రవాదుల దాడులను చూసి రష్యా కంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఈ నేపథ్యంలో రష్యా తేరుకుని బెలారస్ డ్రోన్లను కూల్చి వేయడం మొదలు పెట్టింది. ఇక లాభం లేదని వారు ఏ విధంగా నైతే దాడులకు తెగబడుతున్నారో అదే స్థాయిలో రివర్స్ ఎటాకింగ్ రష్యా ఆరంభించింది. అయితే రష్యాలో తయారైన డ్రోన్లు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. ఇవి ప్రయోగించినపుడు ఎలా అడ్డుకోవాలో చాలా దేశాలకు తెలుసు. కాబట్టి వాటిని వాడుతూనే ఇరాన్, చైనా తయారు చేసిన నూతన డ్రోన్లను వాడుతూ ప్రత్యర్థిపై దాడులు చేస్తోంది. ఇప్పటివరకు స్నేహంగా ఉంటుందనుకున్న బెలారస్ నుంచే భీకర దాడులు ఎదురు కావడంతో రష్యా షాక్ లో ఉంది. ఇటు నాటో దేశాలు, బెలారస్ తీవ్రవాదుల దాడులను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: