
బ్యాంకుల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. ఇదేమి అన్యాయం అని చంద్రబాబు ఫోటో చూపిస్తే ఆయనే వెళ్లి అడిగి రమ్మన్నారు మీకు 25 వేలు అయిందని మీరు అప్పు తీసుకున్నారు కానీ ఆయన లెక్క ప్రకారం మీ స్కేలు 6000 అప్పు తీర్చాలంటా, 6000 మీ పేరున జమయింది. మీరు ఆల్రెడీ మాకు 6000 వడ్డీ కట్టాలి, మూడేళ్ల నుండి కట్టట్లేదు కాబట్టి జమ చేసుకుంటున్నాం, నువ్వు కడతావా చేస్తావా అని కూర్చున్నారు. దాంతో క్రిసిల్ రేటింగ్స్ కూడా పడిపోయాయి. రకరకాల ఇబ్బందులు కూడా పడిన పరిస్థితి .
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇదే పిలుపు ను ఇచ్చారు. మన పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణాలు తీర్చేస్తాం అని. కిందటిసారి అప్పు తీరుస్తామని కట్టకపోవడం వల్లనే జనం మునిగిపోయారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తిగా తీర్చిన దాఖలాలు లేవు. 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 5లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇస్తామని, రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 3లక్షల నుండి 5లక్షలకు పెంచుతామని పాదయాత్రలో హామీ ఇచ్చారు.
ఇలా హామీలు ఇస్తున్నారు కరెక్టే కానీ డబ్బులు ఎక్కడి నుండి పట్టుకొస్తారు. ఇంకొకటి కేసీఆర్ కూడా ఇలాగే చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి . ఇట్లాంటి దశలో ఈ హామీని నమ్ముతారా లేదా అనేటువంటిది ఇక్కడ అసలు సమస్య.