స్మగ్లింగ్ అనేది ఇదివరకు చాలా రహస్యంగా, అది కూడా అత్యంత రహస్యంగా జరిగేది. అందులోనూ బంగారం స్మగ్లింగ్ అయితే రకరకాల పద్ధతుల్లో రహస్యంగా స్మగ్లింగ్ చేసేవారు. కానీ అవన్నీ పాత రోజులు. ఇప్పుడు బంగారం స్మగ్లింగ్ అనేది చాలా వరకు ఓపెన్ గా జరుగుతున్న వ్యవహారం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు, అంటే చాలామంది వరకూ ఇప్పుడు ఒంటి మీద నగలు వేసుకొచ్చినంత ఈజీగా స్మగ్లింగ్ చేసేస్తున్నారు.


కేరళలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోనే స్మగ్లింగ్ జరిగిన నేపథ్యంలో వార్తల్లోకి వచ్చిన కేరళ, మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు కేరళలో సరికొత్త సీన్ నడుస్తుంది. ఈ సీన్లో ఉన్న విచిత్రం ఏమిటంటే, ఈ ఇతర దేశాలైన దుబాయ్ నుండి గాని, అరబ్ నుండి గాని, సింగపూర్ నుండి గాని వచ్చేటటువంటి విమానాలకు సంబంధించిన సహాయ సిబ్బంది కూడా ఈ బంగారం స్మగ్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.


వెళ్లేటప్పుడు నకిలీ రోల్డ్ గోల్డ్ బంగారు నగలు వేసుకెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఒరిజినల్ బంగారం నగలు వేసుకొచ్చేస్తున్నారట. చెవి దుద్దుల నుండి మెడలో చైన్ దగ్గర నుంచి గాజుల వరకు ఇలా ఇటువంటివన్నీ కలిపి మినిమం 100 నుండి 200 గ్రాములు తీసుకొస్తే సిబ్బంది వాళ్ళని చెక్ చేయరు. ఎందుకంటే వాళ్లు ఏ సగ్లింగ్ చేస్తేనో చెక్ చేస్తారు కానీ ఒంటి మీద వాటిని చెక్ చేయరు.


ఇలా వచ్చే ప్రతిసారి మినిమం 15 వేల నుండి 25 వేల దాకా వీళ్ళకు గిట్టుబాటు అవుతుందట. ఈ కంపెనీలు ఇచ్చే జీతాలు వీళ్ళకి 40 వేల నుండి 50 వేలు, లక్ష రూపాయలు దాకా ఇస్తే వీటి మీద వస్తున్నటువంటిది నెలకు కనీసం 10 ట్రిప్పులు ద్వారా భారీగా ముడుతున్నాయి అనేది తాజాగా తేలుతున్న విషయం. లేటెస్ట్ గా ఒక కుర్రాడు ఇట్లా దొరికిపోతే అతనికి చేతికి కడియాలు లాంటివి పెట్టుకుని తీసుకొస్తున్న సందర్భంలో ఈ స్మగ్లింగ్ బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: