ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థిస్తున్న వారిలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు ఉన్నాయి. కానీ ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కార్మికులు, ఉద్యోగుల నిరసనలు పెరిగిపోతున్నాయి. ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో యుద్ధం వల్లనే ఇదంతా జరుగుతోందని తీవ్ర ఆవేదన వెల్లగక్కుతున్నారు. నిరసనలు పెరుగుతున్నాయి.


కానీ ఇప్పుడు ఆయా దేశాల్లో ఎన్నికల సమయం ఆరంభమైంది. అమెరికాను నమ్ముకుని కూర్చొని ఉంటే ఓట్లు పడవని రాజకీయాల్లో ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తూ తమ దేశంలో ప్రజలను పట్టించుకోకుండా చేస్తున్నారని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి ఓట్లు ఎలా సాధించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.


అయితే దీనికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఆస్ట్రేలియా లోని పార్లమెంట్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వర్చువల్ మీటింగ్ ద్వారా ఆస్ట్రేలియా చేసిన సాయానికి దన్యవాదాలు తెలిపేందుకు మీటింగ్ లోకి వచ్చారు. అయితే దీన్ని ఆస్ట్రేలియా లోని ప్రతి పక్ష ఏంపీలు బాయ్ కాట్ చేశారు. మీరు, మీ దేశం అవలంబిస్తున్న విధానాల వల్ల మా దేశంలో యువతకు ఉద్యోగాలు పోయాయి. ధరలు పెరిగిపోయాయని నిరసన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ప్రతి పక్ష ఎంపీలు అయితే రష్యా కు సపోర్టు చేయాలి, లేకపోతే తటస్థంగా ఉండాలి కానీ ఉక్రెయిన్ కు సపోర్టు చేయడం వల్ల మన దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు.


ఇలా ఒక్కో దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతు తెలిపిన వారు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. మీ వల్లే మా దేశంలో ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా యుద్ధంలో తటస్థంగా ఉండాలని, లేకపోతే రష్యా వల్ల ఇబ్బందులు తప్పేలా లేవని ప్రభుత్వాలని ప్రతి పక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: