అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగం సిద్ధం చేశారు. ఓవైపు తెలంగాణలో బీజేపీ జోరు పెంచిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. కేసీఆర్‌ దేశవ్యాప్త వ్యవహారాలపై దృష్టి సారిస్తే.. కేటీఆర్‌ రాష్ట్రంలో పరిస్థితిపై ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. ఇందు కోసం తాజాగా ఆయన వ్యూహం ఖరారు చేశారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో నిన్న కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.


వచ్చే ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో కదంతొక్కాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ నెల 25వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభలు రాబోవు ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మారిన తెలంగాణ ముఖచిత్రంపై సభల్లో తీర్మానాలు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.


దేశంలో కేసిఆర్ అంటే సంక్షేమం.. మోదీ అంటే సంక్షోభమని ప్రధాన మంత్రిపై వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశప్రజలకు మన ముఖ్యమంత్రి, పిరమైన ప్రధానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. మోదీ అంటే మొండిచెయ్యి అన్న నినాదం..ప్రతి గడపకు చేరాల్సి ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.


ఈ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సభలో కనీసం 6 రకాల తీర్మానాలు చేయాలని.. అందులో ప్రధానంగా వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి- పట్టణ ప్రగతి, విద్య- ఉపాధి, బిజెపి వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు ఖచ్చితంగా ఉండాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.
ప్రతినిధుల సభలో చేసే తీర్మానాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండాలని.. నియోజకవర్గ ప్రతినిధుల సభల ద్వారా నాలుగు లక్షల మంది పార్టీ శ్రేణులకు అన్ని అంశాలపైన రాజకీయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr