ఎన్నికల ముందు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఏపీ కేబినెట్‌ ఓకే చెప్పింది. ఈ నిర్ణయంతో ఏకంగా 10 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు హ్యాపీగా ఫీలవుతున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలపై  ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సీఎం జగన్‌కు.. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేశారని.. ఇప్పుడు సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని ఆయన గుర్తు చేశారు. మళ్లీ వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారని.. మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుంద‌ని ఆయన అన్నారు.


జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో ఇచ్చిన హామీలకు, కొత్త పీఆర్సీ కమిటీ వేసేందుకు ఆమోదం తెలిపినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు చెబుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగులకు కూడా న్యాయం చేశారని... సీపీఎస్ ఉద్యోగులు కూడా జీపీఎస్‌ను స్వాగతించాలని వారు అంటున్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పినా చేయలేదని.. అంతే కాదు.. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై కూడా ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉద్యోగ సంఘాలు నేతలు అంటున్నారు.


మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదనే ఆలోచనే వద్దంటున్న ఉద్యోగ సంఘాలు నేతలు..  కచ్చితంగా మళ్లీ ఈ ప్రభుత్వమే వస్తుందన్నారు. 2024లో మళ్లీ సీఎం అయ్యేది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డే అంటూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని.. అందుకు సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతల అని కాంట్రాక్టు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 2009 నుంచి 2013 మధ్య రిక్రూట్ అయిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని వారు కోరుతున్నారు. నిన్నటి వరకూ దినదిన గండంగాఉద్యోగాలు చేశామని ఇప్పుడు  సంతోషంగా ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: