ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బ్యాంక్ నోట్ ప్రెస్ లో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 జూనియర్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ (లిథో ఆఫ్ సెట్ మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మిషిన్ మైండర్/ఆఫ్ సెట్ ప్రింటింగ్/ప్లేట్ మేకింగ్/ఎలక్ర్టోప్లేటింగ్) లేదా ఐటిఐ (ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/హ్యాండ్ కంపోజింగ్) లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 ఏళ్లు మించరాదు. ఆన్ లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. వేతనం వచ్చేసి రూ. 18,780 నుంచి రూ. 67,390 చెల్లిస్తారు.ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేదిగా నవంబర్ 14, 2022 నిర్ణయించారు. ఆన్ లైన్ పరీక్ష తేది: డిసెంబర్ 2022 లేదా జనవరి  2023లో ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్:https://bnpdewas.spmcil.com ని విజిట్ చెయ్యండి.


విశాఖలోని ఎన్ ఐ వో ప్రాంతీయ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 5 ఖాళీలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 ఖాళీలు ఉన్నాయి.అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ. 25,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 20,000 చెల్లిస్తారు.దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీగా అక్టోబర్ 30, 2022 ను నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్: hrdg@nio.org పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.nio.org ని విజిట్ చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: