ఇపుడిదే అంశం ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటు అధికారపార్టీ నేతలను ఒకటే తొలిచేస్తోంది.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది మాసాల్లో తీసుకున్న అనేక నిర్ణయాలపై  కోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి.  ఒకపుడు తెలంగాణా సిఎం కేసియార్ విషయంలోనే కూడా ఇలాగే జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాగా ఎదురుదెబ్బలు తగిలిన తర్వాతే కేసియార్ తన దూకుడును తగ్గించుకుని ఆలోచించటం మొదలుపెట్టాడు. తర్వాతే పరిస్ధితి మారింది తెలంగాణాలో.

 

ఒకపుడు తెలంగాణాలో ఎటువంటి పరిస్దితి ఉండేదో ఇపుడు జగన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. తాజాగా ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హై కోర్టు కొట్టేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియంను తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇంగ్లీషుమీడియంను ప్రభుత్వం తప్పనిసరి చేయాటం కుదరదన్నది. ఏ మీడియంలో చదవాలన్న నిర్ణయం విద్యార్ధులు, వాళ్ళ తల్లి, దండ్రులకే వదిలేయాలని కోర్టు స్పష్టం చేసింది.

 

విద్యార్ధులు ఇంగ్లీషుమీడియంలో చదివితే భవిష్యత్తు బాగుంటుందన్న జగన్ ఆలోచన మంచిదే. కానీ అందుకు అనుసరించిన విధానం మాత్రం తప్పనే చెప్పాలి. ముందుగా స్కూళ్ళల్లో ఇదే విషయమై విద్యార్ధులు లేకపోతే వాళ్ళ తల్లి,దండ్రుల నుండి అభిప్రాయాలు సేకరించలేదు.  ఇంగ్లీషు మీడియంలో చదివితేనే భవిష్యత్తు బాగుంటుందనేందుకు శాస్త్రీయమైన ఆధారాలేమీ లేదు. విద్యారంగంలోనే కృషి చేస్తున్న నిపుణులతో కానీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ కనీసం విద్యార్ధి సంఘాలతో కూడా జగన్ ప్రభుత్వం చర్చించలేదు.

 

స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం, తెలుగు మీడియం రెండింటిని కంటిన్యు చేసి తెలుగుమీడియంలో ఎవరు చేరటం లేదు కాబట్టి వాటిని మూసేస్తన్నట్లు ఓ రెండు మూడేళ్ళ తర్వాత ప్రకటించినా అర్ధముండేది. ప్రొసీజర్ దేన్ని ఫాలో అవకుండానే ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టే విషయంలో దూకుడుగా ముందుకెళ్ళటంతోనే ఇపుడు ఎదురుదెబ్బ తగిలింది.  

 

ఇదే కాదు మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విజిలెన్స్ కమీషన్, కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసులను కర్నూలుకు తరలించటాన్ని, రాజధాని ప్రాంతంలో పేదలకు భూములు కేటాయింపును కూడా కోర్టు తప్పుపట్టింది. విజిలెన్స్ కమీషన్, కమీషనర్ ఆఫ్ ఎంక్వైయిరీస్ కార్యాలయాలకు అమరావతి సచివాలయంలో చోటు సరిపోలేదు కాబట్టే కర్నూలుకు తరలించినట్లు ఎవరైనా సమాధానం చెబుతారా ? సచివాలయంలో చోటు సరిపోకపోతే విజయవాడలోనే గుంటూరులోనే పెట్టుకోమంటారన్న కనీసం ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: