స్ట్రాంగ్ అండ్ వీక్
ఏమ‌యిన క‌థ ఉంటే కాదు
స‌క్సెస్ ఉంటే క‌ల‌వండి
అప్పుడు మాత్రం ఇండ‌స్ట్రీ మీ వైపు
చాలా కాలం మీ పిల్ల‌లు
మీ క‌ల‌లు ఇవ‌న్నీ దూరంగా ఉంటూ పోతాయి
అప్పుడు మాత్రం మీరు మీతో పాటు మీ అనుకునే లోకం
మీలో స్వార్థం మీ అనుకునే లోప‌లి ప్ర‌య‌త్నం ఒక‌టి వెల్లువ
అప్పుడే సినిమాకో జీవితానికో లేని అశ్లీలార్థాలు వెతుకు
అందాక నీతో నువ్వు నీకు నువ్వు ఓ  వెలి..


 
డైలాగ్ మేక్స్ సెన్స్
సెన్స్ మేక్స్ స‌మ్ నాయిస్
అండ్ నోస్టాల్జియా
ఈ సారి మీరు ఓడిపోండి ఒంట‌రిగా ఉంటే మీకు మీరు
మీతో మీ దుఃఖం దిగులు ఇవ‌న్నీ ఒంట‌రి అవుతాయా
లేదు ఈ వైర‌స్ లు బాగున్నాయి మ‌నిషే బాగాలేడు
వాడు చస్తే ఇంకొంద‌రికి ప్రాణం ఒకింత భ‌రోసా
అస‌లీ బుజ్జిగాడు ఇక్క‌డోడు కాదు
మా ప‌క్క‌నే న‌ర్సీప‌ట్నం ఆ ప‌క్కనే అన‌కాప‌ల్లి
కొన్నిసార్ల‌యినా జీవితంలో ఏడిస్తే న‌వ్వుల విలువ
కొన్ని సార్ల‌యినా న‌వ్వులు దూరం అయితేనే  ఈ గెలుపు విలువ
న‌మ్మితే మోసం.. న‌మ్మకం ఖ‌రీదు ఏద‌యినా కావొచ్చు
అయినా వాడు పూరీ నేను నందా వాడు బద్రీ నాది మాత్ర‌మే టెంప‌ర్  

 

డ‌బ్బులు పోగొట్టుకుని ఏమ‌యినా ఒక చోట ఆగిపోతే ఏమ‌యినా ఒక చోట ఒంట‌రి అని ఓ గిల్టీనెస్ ఉంటే అవి ప‌ట్టించుకోకూడదు. ఇర‌వై ఏళ్ల కింద‌ట నేను ఎలానో ఇప్పుడూ అలానే..ఔన్సార్ మీరు పెద్ద‌వారు అయిపోయారు అని అంటున్నారు రేణూ..హా కాదు మీరు అప్పుడూ ఇప్పుడూ రాక్ స్టార్ అని మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌ను..చిన్న వేషం ఇవ్వండి ప్లీజ్.. చాలా రోజుల‌యింది.. ఇలా న‌వ్వు తూపోతున్నారు.. నువ్వు నందా అయితే నేను బ‌ద్రీ నువ్వు రేణూ అయితే నేను పూరీ ఏమంటార‌యితే.. డ‌బ్బులు అయితే పో గొట్టుకున్న‌డు వంద కోట్లు పోగేసుకుని పోగొట్టుకున్న‌డు బుల్లెట్ లాంటి డైలాగ్ ను  తుపాకీ వేగాన్ని నాటు తుపాకీ లాంటి వేగా న్ని పోగొట్టుకున్న‌డా అంటే లేదు.. మీరు ఫ్లాట్ ఫాం మీద ఉన్నారు ఉండండి మీరు ఎప్పుడు రైలు వ‌స్తే అప్పుడే ఎక్కండి కానీ అ ది వ‌చ్చే దాకా వెయిట్ చేయ‌డ‌మే మీ ల‌క్ష్యం.. ఏం లేదు ఇది జీవితం.. మీకింతా చెప్ప‌నా నాలాంటి క‌ష్టాలే నా బిడ్డ‌ల‌కూ కావాలి
వారికి క‌ష్టం విలువ తెల్సిరావాలి..

 

స‌ముద్రం అంటే ఎందుకు స‌ర్ ఇష్టం
బీచ్ లో చ‌చ్చిపోతారా.. ఓరినాయినోయ్
న‌వ్వేడు ఆలీ.. న‌వ్వేడు పూరీ.. ఎప్పుడూ న‌వ్వులు ఇలానే ఉంటాయి
మీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్,.. నాతో పాటూ న‌లుగురికి తిండి
మీ సినిమా సూప‌ర్ .. నాతో పాటూ న‌లుగురికి నీడ
ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని ఉన్నావు క‌దా! ఏం చేద్దాం
ఇప్పుడూ సినిమానే చేద్దాం.. నేనింతే.. మ‌రి! చ‌చ్చిపోతే తెలియ‌దు
తెలియాల్సిన అవ‌స‌రమే లేదు..
ఇదివ‌ర‌క‌టి పోయెటిక్ ట‌చ్ క‌థ‌ల్లో లేదు ఏమ‌యింది

 

ఇట్లు పూరి ఏమ‌యిపోయాడు లేదండి జ‌నంకు ఏం కావాలో అదే ఇస్తాను
నేను ఆ ఫీల్ తో తీసినా ఒప్పుకోరు.. అయినా చూద్దాం..
ఇండ‌స్ట్రీలో డెన్ లు ఉంటాయి ఫ్యాక్ట‌రీలు ఉంటాయి పొగ‌చూరిన బ‌తుకులూ ఉంటాయి
నాకు త‌గ్గ పాట నాకు త‌గ్గ మాట నాకు క‌థ ఉంటే చెప్పు అన్న వారే ఉంటారు
నీకు తూగినంత నీకు ప‌ట్టినంత నీకు నీవు విస్తారం అయి న చోట న‌న్ను తీసుకుపో అని ఎవ్వ‌రూ చెప్ప‌రు
పూరీ ఆర్జీవీ.. లాంటోళ్ల‌కు డ‌బ్బులు ప‌ట్ట‌వు అని అనుకుంటాను.. అయినా డ‌బ్బు ప‌ట్టింపు ఉంటే ఆ నోట్ల‌ను విసిరి కొట్టి మ‌ళ్లీ
సంపాదించే గ‌ట్స్  ఉన్నోళ్లు ఇప్పుడు ఏం చెప్పినా బాగుంటుంది.. సో..  ఏం కోల్పోయామో అన్న‌ది ఊహ ఏం తెచ్చిపెట్టుకున్నాం
అన్న‌ది ఊహ ఈ రెండూ ఊహలే కావాలి.. లేదా వాస్త‌వ‌ల‌యి ఊహ‌ల‌ను త‌ల‌పించాలి .. ఆరో త‌ర‌గ‌తిలో పూరీ క‌థ రాశాడు..

 

ఇంకా ఏవేవో చ‌దివాడు.. కానీ ఆ చ‌దువు ఈ సంస్కారం ఇవ‌న్నీ ఇంకొన్ని విలువ‌ల‌కు అద‌నం అయి ఉంటాయి అని అంటాడు..
కానీ మీరు విలువ‌ల‌ను న‌మ్ముకోవొద్దు అని మాత్ర‌మే అంటాడేంటో! అదే అర్థం కాదు.. నేను నాతో బాగుంటున్నా అని ఎవ్వ‌రూ
చెప్ప‌రు .. వాడొక్క‌డే ఈ ఒంట‌రిత‌నం ఈ  నిర్బంధ క్ష‌ణం బాగున్నాయి అని చెప్పిపోతాడు.. తీపి పూత‌ల మాట ఒక‌టి వ‌దిలి చాలా కాలం అయ్యిందేమో! అయ్యో! బ‌చ్చ‌న్ సాబ్ ! వీడు బుడ్డోడు ఓ సిన్మా  చేసేయ్యండి.. అంటూ ఆర్జీవీ .. స‌ర్! నా క‌థ వినండి
ఏమ‌యినా ఉంటే చెప్పండి అంటూ పూరీ.. ఇలా త‌బ్బిబ‌యితే సినిమా క‌ట్ చేస్తే బ‌చ్చన్ సాబ్ బుడ్డా హోగా తేరా బాప్

 

ఇరవై ఏళ్లు
ఏమ‌యినా పోగొట్టుకున్నారా
మ‌రో ఇర‌వై ఏళ్లు
ఏమ‌యినా సంపాదించి పోతారా
తెలియ‌దు సింహాలు తోడేళ్ల రాజ్యంలో ఎన్ని ఏళ్లు ..
అన్న‌ది లెక్క‌ల్లో.. ఎలా బ‌తికాం అన్న‌దే విలువ‌ల్లో!
తెలియ‌దు చివ‌రి ఆశ్చ‌ర్యం ఎందుకు అని??
మీతో మీరు ఇక్క‌డ దారి త‌ప్పిపోతే బాగుండు అని అంటాడా ప్ర‌కాశ్ రాజ్
అదే చేయండి.. పూరీ స‌ర్.. దారి త‌ప్పిపోండి.. ఏం కాదు..
ఎలానో ప్రకాశ్ రాజ్ స‌ర్ ను అడ‌గండి..హా హా హా
డియ‌ర్ ఫైట‌ర్ ఆల్ ద బెస్ట్


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

మరింత సమాచారం తెలుసుకోండి: