జగన్మోహన్ రెడ్డి పదకొండు మాసాల క్రితం 151 సీట్ల  అఖండ మెజారిటితో  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో నిజానికి ప్రతిపక్షమన్నదే లేకుండా  పోయింది. కానీ పరిపాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వరుసగా ఎదురు దెబ్బలు తగులుతునే ఉన్నాయి.  ఒకవైపు ప్రతిపక్షం లేక మరోవైపు ఎల్లోమీడియాను జనాలు పట్టించుకోకపోయినా జగన్ కు ఎదురుదెబ్బలు ఎలా తగులుతున్నాయి ? ఇపుడిదే విషయమై  రాష్ట్రంలో మెజారిటి జనాల్లో చర్చ మొదలైంది.

 

ఒకటి కాదు రెండు కాదు  తీసుకుంటున్న నిర్ణయం ఏదైనా కానీండి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతునే ఉన్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అమలుకు నోచుకోకుండా ఆగిపోతున్నాయి ఎందుకు ? ఎందుకంటే న్యాయవ్యవస్ధలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వీగిపోతున్నాయి కాబట్టే. జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు జనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నవే అయినా న్యాయస్ధానాలు మాత్రం అలా అనుకోవటం లేదు. ఎందుకున్నదే అర్ధం కావటం లేదు.

 

పేదల పిల్లలకు స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంలో చదువులు చెప్పించాలని జగన్ అనుకున్నాడు. ఆ నిర్ణయాన్ని  కోర్టు అడ్డుకున్నది. చదువుకునే పిల్లలు, వాళ్ళ తల్లి, దండ్రులు జగన్ నిర్ణయాన్ని ఆహ్వానించినా కోర్టు మాత్రం కుదరదని చెప్పేసింది. అలాగే జనాల మీద పడుతున్న విద్యుత్ భారాన్ని తగ్గిద్దామని జగన్ అనుకున్నాడు. అందుకనే అప్పటి వరకూ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్ధలతో ధరల విషయంలో సమీక్షించాలని అనుకున్నాడు. దాన్ని కూడా కోర్టు అడ్డుకున్నది.

 

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేద్దామని జగన్ అనుకుంటే ఇందులో కూడా పెద్ద రబసే జరిగింది. కరోనా వైరస్ సంక్షోభంలో జనాలకు సాయంగా ఉండాలని వైసిపి ఎంఎల్ఏలు  ప్రయత్నించారు. ఎవరో కేసు వేస్తే దాదాపు ఎనిమిది మంది ఎంఎల్ఏలపై కోర్టు విచారణ మొదలుపెట్టింది. అలాగే నర్సీపట్నం ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ గొడవ అందరికీ తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ఉన్నతాధికారులను నోటికొచ్చినట్లు సస్పెండ్ అయ్యాడు.

 

తర్వాత కొద్ది రోజులకు ఇదే డాక్టర్ వైజాగ్ రోడ్లపై నానా గొడవ చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక పరిస్ధితి సరిగా లేదని డాక్టర్లు చెబితే మెంటల్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తోంది ప్రభుత్వం. ఇదే విషయమై టిడిపి మాజీ ఎంఎల్ఏ వంగలపూడి అనిత ఓ కాగితం మీద ఫిర్యాదు చేయగానే హై కోర్టు వెంటనే విచారణ మొదలుపెట్టేసింది. చివరకు రాష్ట్రప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పి ఏకంగా సిబిఐ విచారణకే ఆదేశించేసింది.

 

నిజానికి డాక్టర్ వివాదం చాలా చిన్న విషయం. కానీ హై కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. అలాగే పంచాయితీ భవనాలకు పార్టీ రంగులు వేయటాన్ని కోర్టు తీవ్రంగా ఆక్షేపించటం వరకు కరెక్టే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకూ ఎందుకు కోర్టుల్లో వీగిపోతున్నాయనే విషయాన్ని ఒకసారి అందరూ ఆలోచించాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: