చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ విష‌యంలో టీడీపీ బిగ్ ప్లాన్ సిద్ధం చేసిందా? ఆయ‌న చుట్టూ తిరుగు తున్న రాజ‌కీయాల‌కు మ‌రింత బూస్ట‌ప్ ఇవ్వాల‌ని నిర్న‌యించిందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల కులు. చంద్ర‌బాబు త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేది ఎవ‌రు?  జూనియ‌ర్ ఎన్టీఆరా?  లేక బాల‌య్యా?  వీరిద్ద‌రూ కాక లోకేషా? అనే సందేహాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో ఎ ప్పుడూ చ‌ర్చ సాగుతూనే ఉంది. అయితే, తాజాగా మ‌హానాడులో ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంద‌ని పార్టీ నా య‌కులు భావించారు. అయితే, తేనె తుట్టె వంటి ఈ విష‌యాన్ని క‌ద‌ప‌కుండానే చంద్ర‌బాబు మ‌హానాడుకు చాప‌చుట్టేశారు.

 

అయితే, అంత‌ర్గ‌త చ‌ర్చల్లో మాత్రం.. పార్టీకి త‌న త‌ర్వాత నాయ‌క‌త్వం వ‌హించేది ముందుకు న‌డిపించేదీ లోకేష్ బాబేన‌ని చంద్ర‌బాబు త‌ర‌చుగా చెబుతున్నారు. అయితే, దీనిపై బుచ్చ‌య్య చౌద‌రి, అయ్య‌న్న పా త్రుడు వంటి సీనియ‌ర్లు అడ్డు చెబుతున్నారు. ఇంకా ముక్కుప‌చ్చ‌లార‌ని లోకేష్‌కు ఇంత పెద్ద పార్టీ బాధ్య ‌త‌లు ఎలా అప్ప‌గిస్తారు? అనే ప్ర‌శ్న‌కూడా వీరు సంధించారు. దీంతో లోపాయికారీగా లోకేష్‌ను అన్ని విష‌యాల్లోనూ ప్రొజెక్ట్ చేయాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు. మ‌రీ ముఖ్యంగా పార్టీలో త‌లెత్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని ఆయ‌న‌కే అప్ప‌గించి.. తెర‌వెనుక బాబు వ్యూహం అమ‌లు చేయించాల‌ని నిర్ణ‌యించారు.

 

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల లోకేష్ అనంత‌పురంలో త‌లెత్తిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి అరెస్టు విష‌యంలో జోక్యం చేసు కున్నారు. అదేస‌మ‌యంలో రేప‌ల్లె, ప‌రుచూరు ఎమ్మెల్యేలు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం తెర‌మీదికి రాగానే.. వారితో చ‌ర్చించారు. దీంతో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, పార్టీ అనుకూల మీడియాలోనూ లోకేష్‌కు అనుకూలంగా షార్ప్ షూట‌ర్‌గా తెర‌మీదికి తెచ్చేలా క‌థ‌నాలు ప్ర‌చారం చేసేలా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా అధ్య‌క్ష పీఠం ఎక్కేందుకు ఉన్న అన్ని సోపానాల‌ను లోకేష్ అధిరోహించేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని, బాబు త‌ర్వాత పార్టీలో త్వ‌ర‌లోనే లోకేష్ నెంబ‌ర్ 2కాబోతున్నార‌ని త‌మ్ముళ్లు తాజాగా చ‌ర్చించుకుంటారు. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: