మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెన్నులో వణుకు మొదలైందా..? ఆయనకి అరెస్ట్ భయం పట్టుకుందా..? అంటే అవుననే తెలుస్తుంది. మొన్న టెక్కలిలో అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నారా లోకేష్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం.

 

ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనతో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే తాజాగా.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేష్ టెక్కలి వెళ్లారు. వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయడు అరెస్ట్ కేవలం కక్షపూరితమేనని, అధికార పార్టీ కావాలనే ఇలాంటి దుర్మార్ఘపు చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. అలాగే తనపై వస్తున్న ఫైబర్ గ్రిడ్ ఆరోపణల గురించి మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ కు, ఐటీ మంత్రికి సంబంధం లేదన్నారు.

 

ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి అవినీతి ఆరోపణల మీద ప్రభుత్వం విచారణ చేస్తున్న నేపథ్యంలో నాటి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లోకేష్.. ఐటీ శాఖకు, ఫైబర్ గ్రిడ్ కు సంబంధం లేదని చెప్పుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ఫై విచారణ చేస్తుండగా ముందుగానే ఆ విచారణ తనపై కాదన్నట్లు, తనకేమి సంబంధం లేదన్నట్లు అయన మాట్లాడటం ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ లో 330కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిలో అప్పట్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న హరిప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. నిజానికి అయన అనర్హుడు.

 

అంతకు ముందు సంవత్సరమే అయన కంపెనీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళింది. అయినప్పటికీ ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఉన్న సమయంలో 330 కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు ఆయనకు ఇచ్చారు. ఈ విషయమై అప్పట్లో  ఐఏఎస్ అహమ్మద్ బాబు, మంత్రి లోకేష్ ఫై ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దానికి సంబంధించి సాక్ష్యాలను సేకరించే పనిలో పడింది. ఒకవేల సాక్షాధారాలు లభిస్తే మాత్రం ఐఏఎస్ అహమ్మద్ బాబు, లోకేష్ లను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పుకార్లు మాత్రం వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఫైబర్ గ్రిడ్ తో ఐటీ శాఖకు సంబంధం లేదని చెప్పుకోవడం చూస్తుంటే లోకేష్ కు అరెస్ట్ భయం పట్టుకుందేమో.. అందుకే ఆ విదంగా చెప్తున్నారేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: