పార్టీలో గాని, ప్రజల్లో కానీ, కేటీఆర్ వ్యవహారశైలిపై విమర్శలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేకుండా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నారు. విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేసిన అనుభవం ఉండడం, ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా కేటీఆర్ రాజకీయాలను ముందుకు నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు. పార్టీలో నాయకులపై ఎప్పటికప్పుడు కన్ను వేస్తూ, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటూ అనేక సర్వేలు చేయిస్తూ, ఎక్కడా ఎవరికీ అసంతృప్తి లేకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ ఎక్కడైనా నాయకుల మధ్య గ్రూపు తగాదాలు, అసంతృప్తి తలెత్తినా, వెంటనే కేటీఆర్ రంగంలోకి దిగి కేటీఆర్ పరిస్థితిని చక్క పెడుతున్నారు.
అలాగే సోషల్ మీడియా ద్వారా వివిధ సమస్యలను పరిష్కరిస్తూ, పరిష్కార మార్గాలను సూచిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ లో గాని, ప్రభుత్వంలో గాని, కేసీఆర్ తర్వాత సమర్ధుడైన నాయకుడు కేటీఆర్ అని చెప్పుకునేందుకు ఎటువంటి సందేహం అవసరం లేదు.. అన్నట్లుగా కేటీఆర్ సమర్ధతను నిరూపించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.
దీనిలో భాగంగానే ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడంతో, పూర్తిగా ఆ బాధ్యతలు కేటీఆర్ చూసుకున్నట్టుగానే వ్యవహరిస్తూ, నిత్యం అధికారులతో సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ, కెసిఆర్ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నా, ఆ విమర్శలు ఎక్కడ తలెత్తకుండా, అన్ని తానే చక్కబెట్టడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో కేసీఆర్ కు ఎటువంటి టెన్షన్ లేకుండా, ఆయన వారసులు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తూ ఉండడంతో, కెసిఆర్ లోను ఆనందం వ్యక్తం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే, సమర్థుడైన రాజకీయ వారసుడుని టిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ అందించారనే చెప్పుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి