చెప్పుకోవటానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే కానీ అనుభవం మాత్రం ఎందుకూ పనికొస్తున్నట్లు లేదు. తాజాగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు ఎంతగా వ్యతిరేకిస్తున్నాడో అందరికీ తెలిసిందే. వ్యతిరేకించటం ఒక ఎత్తైతే వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించటం ఏపిలో తప్ప ఇంకే రాష్ట్రంలో లేవంటూ చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇదే విషయమై ప్రభుత్వం సలహాదారు అజేయ కల్లం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా, ఏపి, తమిళనాడులో తప్ప మిగిలిన అన్నీ రాష్ట్రాల్లోను వ్యవసాయ విద్యుత్ కు మీటర్లున్నట్లు చెప్పటం గమనార్హం. తాజాగా అజేయ కల్లం ప్రకటనతో చంద్రబాబు అబద్ధాలు చెప్పినట్లు స్పష్టమైపోయింది. అసలు చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చింది ?  ఏమొచ్చిందంటే అబద్ధాలు చెప్పటం ఆయన నైజంగా మారిపోయిందని వైసిపి నేతలు మొదటి నుండి చెబుతునే ఉన్నారు.





ఏ అంశంలో అయినా సరే తాను చెబుతున్నది అబద్ధమని తెలిసినా సరే అబద్ధాలు చెప్పటం చంద్రబాబుకు బాగా అలవాటు అయిపోయిందని వైసిపి నేతలు మొదటి నుండి ఎద్దేవా చేస్తునే ఉన్నారు. ఆమధ్య వర్షాలు కురిసినపుడు తాను అక్రమంగా నివాసముంటున్న కరకట్టపై ప్రభుత్వం ద్రోన్ కెమెరాను నడిపిందంటూ నానా యాగీ చేశాడు. జడ్ ప్లస్ క్యాటగిరిలో ఉన్న తన ఇంటిపైనే ప్రభుత్వం ద్రోన్ కెమెరాను ఎలా తిప్పుతుందంటూ రోజుల తరబడి యాగీ చేశాడు. తీరా విషయాన్ని ఆరాతీస్తే ప్రభుత్వం ద్రోన్ కెమెరాను ఎగరేయనే లేదు. ఎగిరిన ద్రోన్ కెమెరా ఓ ఎల్లోమీడియా యాజమాన్యందని తేలింది. ఈ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా సరే యాజమాన్యాన్ని ఏమి అనలేక ప్రభుత్వంపై బురద చల్లేశాడు.





ఇక కరకట్ట మీద అక్రమ నిర్మాణంలో ఉంటున్న నివాసంపైన కూడా ఎన్ని అబద్ధాలు చెప్పింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. అక్రమకట్టడాన్ని దాని  యజమాని  లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఇచ్చేశాడని, దాన్ని ప్రభుత్వం తీసేసుకుందని అధికారంలో ఉన్నంత కాలం చెప్పాడు. ప్రతిపక్షంలోకి రాగానే తానుంటున్నది ప్రైవేటు నిర్మాణమే అంటూ కొత్త రాగం అందుకున్నాడు. అక్రమనిర్మాణాన్ని ప్రభుత్వం తీసేసుకున్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తే మళ్ళీ నోరెత్తలేదు.  ఇలా ఎప్పటికప్పుడు తనకేది కన్వీనియంటో అలా చెప్పుకుంటూ పోవటమే చంద్రబాబు నైజం. తాను చెబుతున్నది అబద్ధమా ? లేకపోతే నిజమేనా ? అన్న విషయంతో సంబంధం లేదు. తాజాగా చెప్పిన విద్యుత్ మీటర్ల విషయాన్నే తీసుకుందాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు లేవని చెప్పాడు. ఇదే విషయాన్ని గూగుల్ సెర్చిలో వెతికితే ఏ విషయమూ స్పష్టంగా తెలిసిపోతుంది. ఇపుడు అజేయ కల్లం చేసిన ప్రకటనతో చంద్రబాబు పరువంతా కరకట్టలో కలిసిపోయింది.





నిజానికి వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగిస్తే ఇటు రైతులకు అటు ప్రభుత్వానికి చాలా లాభముంటుందని ప్రభుత్వంలోని పెద్దలు పదే పదే చెబుతున్నది వాస్తవమే. ఏ రంగంలో ఎంత విద్యుత్ వాడుతున్నది లెక్కలు తెలియకపోతే ఎలాగన్నది ప్రభుత్వ వాదన. ఇపుడు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు లేకపోవటం వల్ల వ్యవసాయ విద్యుత్ వాడకం ఎంతనే విషయంలో ఎవరి దగ్గరా స్పష్టమైన లెక్కలు లేవు. అదే మీటర్లు బిగిస్తే కచ్చితమైన లెక్కలు వచ్చేస్తుంది.  ఒకసారంటూ లెక్కలు వస్తే ఏ సమయంలో రైతులు ఎంత విద్యుత్ వాడుతున్నారనే విషయంలో కూడా క్లారిటి వస్తుంది. అపుడు రైతుల విద్యుత్ వాడకనాకి తగ్గట్లుగానే విద్యుత్ సరఫరా చేస్తే లో ఓల్టేజీ సమస్యలుండవు. విద్యుత్ వాడకంలో పీక్ అవర్సేవి, నాన్ పీక్ అవర్సేవి అనే విషయం ప్రభుత్వానికి తెలిసిపోతుంది. కాబట్టి పీక్ అవర్సులో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేట్లుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్న లాభాలు కాకుండా ఒకవేళ రైతులకు నష్టాలే జరుగుతాయని అనుకుందాం. అప్పుడు నష్టపోయేది అధికారపార్టీయే కదా ?  తెలిసి ఎవరైనా నష్టపోయే పనులు చేస్తారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: