తాము దేవుడిలా కొలిచే తమ అభిమాన నాయకుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటేందుకు ముందుకు రావడంతో , అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. దీనికి తోడు ఏపీలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం, రాజకీయంగా పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగా అవకాశాలు ఉండడంతో, సీఎం పీఠంపై కూర్చుంటారని అంతా, అనుకున్నారు. కానీ దారుణమైన పరిస్థితులు ఎదురవడంతో, వారంతా ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. జనసేన పార్టీ ఎప్పటికైనా ఏపీలో అధికారం దక్కించుకుంటుంది అని, తమ అభిమాన నాయకుడు పవన్ ఎప్పటికైనా సీఎం కుర్చీలో కూర్చుంటారు అని, అంతా భావిస్తున్నా, పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు.
2014 ఎన్నికలకు ముందే జనసేనను స్థాపించినా,
పవన్ వేసిన చిన్న చిన్న తప్పటడుగులు ఇప్పటికీ
జనసేన కు పూర్తిస్థాయిలో క్రేజ్ తీసుకురాలేక పోతున్నాయి.అప్పట్లో తెలుగుదేశం పార్టీతో కలిసి
పవన్ తప్పటడుగులు వేయడం, ఆ తప్పటడుగులు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టుగా జనాల్లో అభిప్రాయం కలగడం , రాజకీయంగా పూర్తిస్థాయిలో
పవన్ ను నమ్మే పరిస్థితి లేకపోవడం, దీనికి తగ్గట్టుగానే
పవన్ సైతం అనుమానాస్పదంగానే ఉండడం వంటి ఎన్నో కారణాలు జనసేనకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. దీనికి తోడు పార్టీలో బలమైన, కీలకమైన నాయకులు పెద్ద ఎత్తున వచ్చి చేరుతారు అని భావించినా, వలసలు పెద్దగా లేకపోవడం, ఆ పార్టీలో
పవన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన వారు సైతం ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తు ఉండడం వంటి వ్యవహారాలు ఎన్నో ఎన్నెన్నో
జనసేన కు ఇబ్బందికరంగా మారాయి.
ఇప్పుడు చూస్తే
పవన్ కు అత్యంత సన్నిహితుడైన
నాదెండ్ల మనోహర్ వంటి వారు పక్క చూపులు చూస్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో వచ్చి చేరేవారు లేకపోగా, చేరిన వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, వంటివి వ్యవహారాలు జనసేన కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే, ఒక వైపు సినిమాల వైపు
పవన్ దృష్టి పెట్టడంతో అప్పుడప్పుడు మాత్రమే రాజకీయ అంశాల పై స్పందిస్తూ ఉండటం, వంటి వ్యవహారాలు ఎన్నో ఇప్పుడు ఆ
పార్టీ నేతలకు కాస్త అసహనం తెప్పించే విధంగానే తయారయ్యాయి.