కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల బాధ్యతలను తలకెత్తుకున్నారు. ప్రధానమంత్రి, అమిత్ షా పదుల సంఖ్యలో ప్రచార సభల్లో, ర్యాలీల్లో పాల్గొన్నా అసంతృప్తి ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బంగ్లా బెబ్బులిలా మమత గర్జించిన తీరు అసమానమనే చెప్పాలి. మమత రాజకీయ పోరాటాన్ని ప్రత్యర్థులు సైతం కొనియాడకుండా ఉండలేకపోతున్నారంటే ఆమె పోరాటం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తగా 1970వ దశకంలో రాజకీయంలోకి ప్రవేశించిన మమతా బెనర్జీ.. అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ స్థాయికి ఎదిగారు. జగదేవ్ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి సీపీఎం దిగ్గజ నేత సోమనాథ్ ఛటర్జీని ఓడించారు. 1984లో పిన్నవయస్సులోనే పార్లమెంటరీలోకి ప్రవేశించారు. తర్వాత 1991, 96, 98,99,2004 జనరల్ ఎలక్షన్స్‌లో విజయం సాధించారు. బొగ్గు గనులు, రైల్వే శాఖల బాధ్యతలు చేపట్టారు. 1997లో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోమేంద్ర నాథ్ మిత్రతో అభిప్రాయబేధాలు ఏర్పడి, పార్టీ వీడి ముకుల్ రాయ్‌తో కలిసి 1998 జనవరిలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు.
పార్టీని నెలకొల్పిన వెంటనే రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంగా అవతరించింది. 2011లో పార్టీని అధికారంలోకి వచ్చింది. ప్రజా పోరాటాల్లో చురుకుగా పాల్గొని 2011 మే 13న దీదీ బెంగాల్ సీఎం అయ్యారు. మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి దీదీ చుక్కలు చూపించారు. సీపీఎంను రాష్ట్రంలో మట్టికరిపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత ఆ పార్టీని రాష్ట్రంలో దాదాపుగా తుడిచేసినంత పనిచేశారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలనూ దీటుగా ఎదుర్కొని తనకు సవాలే కాదన్న పరిస్థితికి నెట్టేశారు. దీదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను సాధించుకోలేకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బెంగాల్ సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి