ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఇందిరాశోభన్ నిన్న రాజీనామా చేశారు. అంతకు ముందు కేకే రెడ్డి అనే నేత వెళ్లిపోయాడు. ఇలా వరుస రాజీనామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం ఏమవుతుందన్న చర్చ మొదలైంది. అసలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడే.. ఈ చర్చ మొదలైంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు అవసరమైన పొలిటికల్ స్పేస్ ఉందా అన్న చర్చ జరిగింది. అయితే నాయకులు ఎప్పుడూ స్పేస్ చూసుకుని రారు.. స్పేస్ క్రియేట్ చేసుకుంటారని షర్మిల పార్టీ నేతలు చెప్పుకున్నారు.
అయితే.. షర్మిల పార్టీ పెట్టి మూడు, నాలుగు నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఉనికి చాటుకోవడం లేదు. అసలు ఆ పార్టీ ఒకటి ఉందన్న సంగతి జనానికి చేరడం లేదు. పార్టీ నిత్యం జనంలో ఉండాలి.. జనం సమస్యలపై పోరాడాలి.. అప్పుడే ప్రజలకు చేరువవుతోంది. అయితే ఈ దిశగా షర్మిల అసలేమీ చేయలేదని చెప్పలేం.. ఆమె నిరుద్యోగ అంశాన్ని తలకెత్తుతుని హైదరాబాద్‌లో దీక్ష చేశారు. ప్రతి వారంలో ఓ రోజు ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఒక రోజు దీక్ష చేస్తున్నారు.
రాజకీయ పార్టీకి డైనమిజం అవసరం.. ఆ పార్టీ పట్ల నాయకులు ఆకర్షితులు కాకపోతే.. ఇక జనం మాత్రం ఎలా పట్టించుకుంటారన్నది చూడాలి. అయితే షర్మిల పార్టీ అప్పుడే చేతులెత్తేసిందని కూడా చెప్పలేం. ఏవ్యూహం లేకుండా షర్మిల ముందుకు వెళ్తారనీ చెప్పలేం.. షర్మిల భవితవ్యం తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి