పీ రాజకీయం మరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో బూతుల ప్రవాహం సాగుతోంది. రాజకీయ నాయకులు కాదు కదా.. సామాన్యులు కూడా సిగ్గుపడే స్థాయిలో ఉన్నత స్థాయి నాయకులు తిట్టుకుంటున్నారు. బూతులు, వ్యంగ్యాలు హద్దు మీరుతున్నాయి. అయితే ఈ బూతుల తిట్లు మొదలు పెట్టింది ఎవరు..కొనసాగిస్తున్నది ఎవరు.. అడ్డుకోవాల్సింది ఎవరు.. పూనిక వహించాల్సింది ఎవరు.. అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.


కానీ ఇప్పుడు ఏపీలో ఇలా ఆలోచించేవాళ్లే కరవయ్యారు. ఏదో ఒక పక్షం వైపు చేరి.. అవతలి పక్షం తప్పులు ఎత్తి చూపడంలో రెండు పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో నువ్వు రాళ్లు విసిరితే అవతలివాడు పూలు చల్లతాడా.. చల్లడు కదా. నువ్వు బూతులు చిమ్మితే అవతలివాడు కూడా అంతే.. ఇంకాస్త డోసు పెంచి.. వీర బూతులు అందుకుంటాడు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే కదా.


గతంలో జగన్ మంత్రులు ఈ బూతు పురాణాన్ని ప్రారంభించారు. వారిలో కొందరు ప్రత్యేకంగా ఈ బుతుల కోసమే నియమించారా అన్న అనుమానాలు కలిగాయి కూడా. సదరు నాయకులు చంద్రబాబును బూతులు తిట్టినప్పుడు జగన్ చిద్విలాసంగా ఆనందిస్తూ వచ్చారు. అలా తిట్టిన నాయకులు.. చంద్రబాబు వయసు, అనుభవం, హోదా ఏవీ పట్టించుకోలేదు. ఇక కొందరయితే ఏకంగా బూతు మంత్రులు అనే బిరుదులు సంపాదించుకున్నారు. అలా చంద్రబాబును బూతులు తిడుతున్నప్పుడు జగన్ ఎప్పుడూ వారించిన పాపాన పోలేదు కూడా. ఆ బూతులు విన్నవాళ్ళు పాపం చంద్రబాబు అనుకునేలా ఉండేది పరిస్థితి.


జగన్ ఆ తప్పు చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి కూడా అన్ని మర్యాదలు మరిచి ముఖ్యమంత్రిని పట్టుకుని అసహ్యంగా తిట్టాడు.. పోనీ చంద్రబాబు అయినా ఆయన్ను వారించాడా.. లేదు.. ఇంకా వెనకేసుకొస్తూ దీక్షలు చేస్తున్నారు. జగన్, చంద్రబాబు ఇప్పుడైనా కాస్త పెద్దరికం వహిస్తే అది ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ తరాలకు మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: