అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్, తాడిపత్రి, గుంతకల్ నియోజకవర్గాలతో అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా ఏర్పడనుంది. కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ రెవెన్యూ డివిజన్లతో 34 మండలాలు ఉంటాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా కొత్తగా శ్రీసత్యసాయిజిల్లా ఏర్పడనుంది. పెనుగొండ , పుట్టపర్తి, కదిరి రెవన్యూ డివిజన్లు, 29 మండలాలు ఉంటాయి.
అయితే.. అనంతపురం జిల్లాను విడదీయడం వల్ల.. తమకు ఇబ్బంది లేదని.. జేసీ వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై అనేక రూపాల్లో ఉద్యమాలు తెరమీదికి వచ్చినా. ఈ వర్గం నుంచి ఎలాంటికామెంట్లు లేకుండా పోయాయి. సాధారణంగా.. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే.. ఈ విషయంలో జేసీ వర్గం.. కూడా స్వాగతిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే.. ఇలా అని.. బయటకు చెప్పుకొంటే.. తమకు రాజకీయంగా ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తోందా? అనే సందేహాలు వస్తున్నాయి. అలాగని వ్యతిరేకించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
మొత్తంగా చూస్తే.. అనంత జిల్లాల ఏర్పాటు .. జేసీ వర్గానికి కక్కలేని మింగలేని పరిస్థితిని తీసుకువచ్చిందని అంటున్నారు పరిశీలకులు. తమకు మేలు చేస్తే.. మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు కదా! అయితే.. ఈ విషయంలోనూ సైలెంట్‌గానే ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి