ప్రతిపక్షంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీలో అక్కడకక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే...సొంత పార్టీ నేతల మధ్య రాజకీయంగా విభేదాలు రావడం పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. ఎలాగో అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు నడిచింది...దాని వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది. అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక కాస్త పోరు తగ్గింది. కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా సీట్లు విషయంలో నేతల మధ్య రగడ ఉందని చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే టీడీపీ కంచుకోట అయిన విజయనగరంలో కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. విజయనగరం అసెంబ్లీ సీటులో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు పెద్దగా పడటం లేదని చెప్పొచ్చు. వాస్తవానికి విజయనగరం అసెంబ్లీ సీటు అశోక్ ఫ్యామిలీదే. ఎన్నో దశాబ్దాల నుంచి అశోక్ ఫ్యామిలీ విజయనగరం సీటులో పోటీ చేస్తూ వస్తుంది. అలాగే అశోక్ సైతం ఈ సీటులో 7 సార్లు గెలిచారు.

కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్లాన్ మార్చి...అశోక్‌ని విజయనగరం పార్లమెంట్ సీటులో నిలబెట్టారు. ఇటు విజయనగరం అసెంబ్లీ సీటులో మీసాల గీతని నిలబెట్టారు. అటు ఎంపీగా అశోక్ గెలిచారు...అలాగే అశోక్ సపోర్ట్‌తో అసెంబ్లీలో గీత గెలిచారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి మళ్ళీ తమ సీటుని అశోక్ ఫ్యామిలీ దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో అశోక్ తనయురాలు అతిథి పోటీ చేయగా, పార్లమెంట్ సీటులో అశోక్ పోటీ చేశారు. జగన్ గాలిలో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక అతిథి బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు...ఈ రెండున్నర ఏళ్లలో అతిథి పికప్ అయ్యారు.

కాకపోతే విజయనగరంలో ఏ కార్యక్రమం జరిగినా అశోక్ ఫ్యామిలీ తనని పిలవడం లేదని, పట్టించుకోవడం లేద్నై చెప్పి గీత సెపరేట్‌గా పార్టీ ఆఫీసు పెట్టుకుని, సెపరేట్‌గా కార్యకర్తలతో రాజకీయం నడిపిస్తున్నారు. దీంతో విజయనగరంలో రెండు వర్గాలు అయ్యాయి. ఈ వర్గ పోరుకు త్వరగా చెక్ పెట్టాలి...లేదంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. మరి చూడాలి ఈ ఆధిపత్య పోరుకు త్వరగానే చెక్ పడుతుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: